ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఆగస్టు 2025లో జీఎస్టీ కలెక్షన్లు ఏకంగా 21% పెరిగి, "ఇప్పటివరకు నెలవారీగా అత్యధిక వసూళ్లు చేసిన రాష్ట్రం"గా నిలిచింది. మొత్తం రూ.3,989 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించడంతో, 2017లో జీఎస్టీ వచ్చాక ఇంత పెద్ద జంప్ అవ్వడం ఇదే తొలిసారి.

రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ ఏ. బాబు చెప్పిన వివరాల ప్రకారం నెట్ జీఎస్టీ కలెక్షన్లు రూ.2,977 కోట్లుగా ఉండగా, గ్రాస్ కలెక్షన్లు రూ.3,989 కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు 2025 వరకూ ఐదు నెలలుగా, ప్రతి నెలా గత ఏడాది రికార్డులను మించిందని చెప్పారు. అంటే కేవలం ఒక నెలకే కాదు, వరుసగా పెరుగుతున్నాయి అని చెప్పారు.
2024 ఆగస్టుతో పోలిస్తే ఈసారి జీఎస్టీ కలెక్షన్లు 13.82% పెరిగాయి. 2023తో పోలిస్తే 14.38% వృద్ధి. ముఖ్యంగా రాష్ట్ర జీఎస్టీ (SGST) కలెక్షన్లు రూ.1,364 కోట్లకు చేరి 13.82% పెరిగాయి. ఐజీఎస్టీ (IGST) సెటిల్‌మెంట్ల ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,613 కోట్లు, ఇది కూడా గతేడాదితో పోలిస్తే 3.76% ఎక్కువ.
పెట్రోలియం రంగం వసూళ్లు ఒక్క ఆగస్టులోనే రూ.1,389 కోట్లకు చేరాయి. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9% ఎక్కువ. ఇంకో స్పెషల్ హైలైట్ ప్రొఫెషన్ ట్యాక్స్ కలెక్షన్లు. ఇవి ఒక్క ఆగస్టు నెలలోనే 42.3% పెరిగాయి.
మొత్తం వసూళ్లు ఎలా ఉన్నాయి?
2025 ఆగస్టులో అన్ని రంగాలు కలిపి రాష్ట్రం వసూలు చేసిన మొత్తం ఆదాయం రూ.4,498 కోట్లు. 2024 ఆగస్టులో ఇది రూ.4,024 కోట్లు మాత్రమే. అంటే 11.78% వృద్ధి. అలాగే ఏప్రిల్ నుంచి ఆగస్టు 2025 వరకు మొత్తం కలెక్షన్లు రూ.22,352 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో రూ.21,164 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తానికి 5.61% పెరుగుదల.
వసూళ్లు పెరగడానికి అసలు కారణం ఏమిటి?
ఇది కేవలం లక్ కాదని అధికారులు చెబుతున్నారు. పన్ను వసూళ్లు పెంచేందుకు రాష్ట్రం కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది. వాటిలో
- డేటా అనలిటిక్స్ వాడటం
- కేంద్ర-రాష్ట్రాల సమన్వయం
- అధికారుల పనితీరును ట్రాక్ చేయడం
- డీఫాల్టర్లపై స్పెషల్ డ్రైవ్స్
- ఐజీఎస్టీ లో నిల్వలో ఉన్న మొత్తాలను రివర్స్ చేయడం
- రిటర్న్ కంప్లయెన్స్ పెంచడం
- ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి వెంటనే వసూళ్లు జరపడం
ఇలా ప్లాన్డ్ మరియు పన్ను శాఖ కొన్ని కఠినమైన మార్పులు పని చేయడం వల్లే వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని ట్యాక్స్ కమిషనర్ ఏ. బాబు స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఈ-ఇన్వాయిసింగ్, ఆన్‌లైన్ బిల్లింగ్, ఈ-వే బిల్లుల అమలును మరింత కఠినతరం చేశారు. దీంతో ఎవరు ట్యాక్స్ ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది.
అంతేకాదు, అధికారులు రెగ్యులర్‌గా ఇండస్ట్రీలు, బిజినెస్‌లపై ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. ఇలా చెక్ చేస్తూ ఫేక్ బిల్లింగ్, నకిలీ GST క్లెయిమ్స్‌ని అడ్డుకున్నారు. ఈ కఠిన చర్యల వల్లే రాష్ట్రంలో వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. వసూళ్లు పెరగడానికి రాష్ట్రం పన్ను శాఖలో టెక్నాలజీ వినియోగం, ఆఫీసర్లకు టార్గెట్స్, మరియు వేగంగా కేసులు క్లియర్ చేసే సిస్టమ్ తీసుకువచ్చింది.
GST 2.0 ఆమోదం వల్ల ప్రభావం:
ఆగస్టులో రికార్డు వసూళ్లు సాధించినప్పటికీ, భవిష్యత్తులో ఈ పెరుగుదల కొనసాగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ముఖ్యంగా జీఎస్టీ 2.0 రిఫార్మ్స్‌కి ఆంధ్రప్రదేశ్ బలంగా మద్దతు తెలిపింది. ఈ రిఫార్మ్స్ కింద స్టీల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్‌పై ట్యాక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం చురుకుగా మారి, ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశముంది. ఇది దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచే ఫ్యాక్టర్ కావచ్చు.
అయితే మరోవైపు, 28% వంటి హై స్లాబ్‌లు తీసేస్తే, రాష్ట్రానికి పెరుగుదల కంటే రెవెన్యూ లోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని ఉత్పత్తులపై ట్యాక్స్ రేట్లు తగ్గడం వలన షార్ట్‌టర్మ్‌లో రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ కాస్త తగ్గే అవకాశం కూడా ఉంది. అందుకే ఇతర రాష్ట్రాలు జీఎస్టీ 2.0పై సందేహం వ్యక్తం చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం దీన్ని "ఆర్థిక చలనం పెంచే అవకాశం"గా చూస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications