జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టించాయి. మార్చి 2022లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో వసూలైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం వృద్ధి నమోదు కాగా, గత ఏడాది ఇదే మార్చి నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదయింది. మార్చి నెలకు గాను రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూళ్లు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం తెలిపింది.
ఇందులో సీజీఎస్టీ రూ.25,830, రాష్ట్రాల జీఎస్టీ రూ.32,378 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ రూ.74,470 కోట్లు. వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.39,131 కోట్లతో కలిపి ఇది ఉంటుంది. సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.981 కోట్లు ఉన్నాయి.

గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు పదిహేను శాతం, 2020లో ఇదే నెలతో పోలిస్తే 46 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు 2022 జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్టంగా ఉన్నాయి. ఈ నెల రూ.1,40,986 కోట్లు వసూలు అయ్యాయి. వరుసగా తొమ్మిదో నెల వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.83 లక్షల కోట్లు నమోదు కాగా, గత ఆర్థిక సంవత్సరం రూ.11.37 లక్షల కోట్లతో పోలిస్తే 30 శాతం అధికం.


Click it and Unblock the Notifications