GST collection: మోదీ సర్కార్ వ్యాట్ స్థానంలో తీసుకొచ్చిన జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని వసూళ్లు ప్రతి నెల పెరుగుతూ రికార్డు స్థాయిలను చేరుకుంటున్నాయి.
ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 2023లో జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికం. ఇది ఇప్పటి వరకు ఒక నెల కాలంలో ఎన్నడూ లేని విధంగా నమోదైన అత్యధిక జీఎస్టీ వసూళ్లుగా రికార్డు సృష్టించింది. FY 2023-24లో సెప్టెంబరులో ముగిసిన మెుదటి ఆరు నెలల కాలంలో స్థూల GST వసూళ్లు రూ.9,92,508 కోట్లుగా నమోదయ్యాయి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. FY 2023-24లో సగటు నెలవారీ స్థూల సేకరణ రూ.1.65 లక్షల కోట్లు, ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల కంటే 11 శాతం ఎక్కువ.
సెప్టెంబర్ 2023లో స్థూల GST ఆదాయం రూ.1,62,712 కోట్లు. నివేదిక ప్రకారం CGST రూ.29,818 కోట్లు, SGST రూ.37,657 కోట్లు, IGST రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 41,145 కోట్లతో కలిపి), సెస్ రూ.11,613 కోట్లుగా నమోదయ్యాయని తాజా గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


Click it and Unblock the Notifications