GST Collection: జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,65,105 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
వస్తుసేవల పన్ను ప్రారంభమైన తర్వాత జీఎస్టీ వసూళ్లు ఐదోసారి రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ వసూళ్లతో పోల్చితే ఈ ఏడాది జూలైలో 11 శాతం ఎక్కువ జరిగాయి. జూలైలో వసూలైన రూ.1.65 లక్షల కోట్ల స్థూల జీఎస్టీలో రూ.29,773 కోట్లు సీజీఎస్టీ కాగా రూ.37,623 కోట్లు ఎస్జీఎస్టీ. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.41,239 కోట్లతో కలిపి రూ.85,930 కోట్లు ఐజీఎస్టీ, వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.840 కోట్లతో కలిపి రూ.11,779 కోట్లు సెస్ ఇందులో ఉన్నాయి.

రెగ్యులర్ సెటిల్‌మెంట్ తర్వాత జూలైలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం CGSTకి రూ.69,558 కోట్లు, SGSTకి రూ.70,811 కోట్లుగా ఉన్నాయి. సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్నులు ఎలా విధించబడతాయో వస్తువులు సేవల పన్ను కౌన్సిల్ స్పష్టం చేసే అవకాశం ఉంది.
పాన్ మసాలా, పొగాకు, నమిలే పొగాకు, హుక్కా, గుట్కా, మెంథా ఆయిల్ తయారుచేసి ఎగుమతి చేస్తున్న కంపెనీల పన్ను ఎగవేతలను అరికట్టడానికి.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్ వీటికి సంబంధించి ఆటోమేటెడ్ IGST రీఫండ్ ప్రక్రియను పరిమితం చేయడానికి నిబంధనలను నోటిఫై చేసింది. రీఫండ్‌లను మాన్యువల్‌గా తనిఖీ చేయడం వల్ల వాల్యుయేషన్ ఉత్తమంగా జరిగిందని, అన్ని దశల్లో పన్ను చెల్లింపులపై దృష్టి సారించేందుకు ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఈ కేటగిరీ వస్తువులపై 28 శాతం IGST, అదనంగా సెస్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications