జీఎస్టీ వసూళ్లు వరుసగా నాలుగోసారి రూ.1.30 లక్ష కోట్లు దాటాయి. 2022 జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020 జనవరి నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే 25 శాతం పెరిగాయి. 2022 జనవరి 30వ తేదీ నాటికి 1.05 కోట్ల జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ దాఖలయ్యాయని, ఇందులో 36 లక్షలు త్రైమాసిక రిటర్న్స్ అని ఆర్థిక శాఖ వెల్లడించింది. జనవరి నెలలో అక్షరాలా రూ.1,38,394 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.
వరుసగా ఏడు నెలలుగా జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. ఏడాది ప్రాతిపదికన జనవరి నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా 26 శాతం అధిక ఆదాయం వచ్చింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ (ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్) ద్వారా వచ్చిన ఆదాయం 12 శాతం పెరిగింది.

2022 జనవరి 31వ తేదీ మధ్యాహ్నం గం.3 సమయానికి స్థూలంగా రూ.1.3 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.24,674 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.31,016 కోట్లు, ఐజీఎస్టీ రూ.72,030 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.31,181 కోట్లతో కలిపి), సెస్ రూ.9,674 కోట్లు (వస్తు దిగుమతులపై వచ్చిన రూ.517 కోట్లతో కలిసి) ఉన్నాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లపరంగా 2021 ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1,39,708 కోట్లు అత్యధికం.


Click it and Unblock the Notifications