GST collections: కేంద్రం రికార్డు జీఎస్టీ వసూళ్లు.. మార్చి 1 నుంచి వాటిపై తగ్గిన జీఎస్టీ రేట్లు..
GST collections: దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యాట్ కి బదులుగా వస్తు సేవల పన్నును జూలై 2017లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఫిబ్రవరి మాసంలో దేశంలో వసూలైన జీఎస్టీ కలెక్షన్స్ వివరాలను వెల్లడించింది.

ఫిబ్రవరి నెలలో..
దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను కింద ఫిబ్రవరిలో వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. దీంతో వరుసగా 12వ నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లకంటే పైన నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంటే ఈ సారి వసూళ్లు 12 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. అయితే 2023 జనవరిలో రూ.1.58 లక్షలు వసూళ్ల కంటే తక్కువగా ఫిబ్రవరి వసూళ్లు ఉన్నాయని వివరాలు చెబుతున్నాయి.

వసూళ్ల వివరాలు..
ఫిబ్రవరిలో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.27,662 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ.34,915 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.75,069 కోట్లు, సెస్సు రూ.11,931 కోట్లుగా ఉన్నాయి. స్థూల GST వసూళ్లు నెలకు పడిపోయినప్పటికీ.. ఫిబ్రవరిలో అత్యధికంగా నెలవారీ సెస్ వసూలు జరిగిందని గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఫిబ్రవరిలో కేవలం 28 రోజులు ఉంటున్నందున కంపేరిటివ్ గా తక్కువ వసూళ్లు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

సెటిల్‌మెంట్స్..
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి సెంట్రల్ జీఎస్టీకి రూ.34,770 కోట్లు, స్టేట్ జీఎస్టీకి రూ.29,054 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది. సెటిల్‌మెంట్ తర్వాత ఫిబ్రవరిలో కేంద్ర ఆదాయం రూ.62,432 కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.63,969 కోట్లుగా ఉంది. అంతేకాకుండా జూన్ 2022కి సంబంధించి రూ.16,982 కోట్ల జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

జీఎస్టీ తగ్గింపు..
జీఎస్టీ కౌన్సిల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొన్ని వస్తువులపై పన్ను రేట్లు మార్చి 1 నుంచి మారనున్నాయి. లిక్విడ్ జాగరీ(బెల్లం)పై 18 శాతం జీఎస్టీ రేటును సున్నాకు తగ్గించింది. ఇదే క్రమంలో విద్యార్థులు వినియోగించే పెన్సిల్ షార్ప్‌నర్స్‌పై జీఎస్టీ రేటును గతంలోని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ట్యాగ్-ట్రాకింగ్ పరికరం లేదా డేటా లాగర్ వంటి పరికరం ఇప్పటికే కంటైనర్లపై ఉంటే, ఆ పరికరంపై ప్రత్యేక IGST విధించబడదు. ఇక కేంద్రరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షలపై జీఎస్టీ మినహాయింపును అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications