అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం జీఎస్టీ వసూళ్లు భారీగా పుంజుకొని, లక్ష కోట్లు దాటడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా మార్చి నుండి లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. మే లేదా జూన్ నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ఆశాజనకంగా కనిపించలేదు. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు కాస్త పుంజుకున్నప్పటికీ, అక్టోబర్ నెలలో మరింత వేగం కనిపించింది.

రూ.1 లక్ష కోట్లు దాటిన వసూళ్లు
ఎనిమిది నెలల తర్వాత జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కును దాటాయి. అక్టోబర్ నెలలో రూ.1,05,155 కోట్లుగా నమోదయింది. ఫిబ్రవరి తర్వాత ఈ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ వాటా రూ.25,411 కోట్లు, ఐజీఎస్టీ వాటా రూ.52,540 కోట్లుగా ఉంది. సమ్మిళిత జీఎస్టీ నుండి కేంద్రం వాటా రూ.25,091 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.19,427 కోట్లుగా ఉంటుంది. కేంద్రానికి మొత్తంమీద రూ.44,285 కోట్లు, రాష్ట్రాలకు రూ.44,839 కోట్లు రానున్నాయి.

ఆర్థిక రికవరీకి నిదర్శనం
2019 అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.95,379 కోట్లు. అంటే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం పెరిగాయి. క్రితం నెలలో 80 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయి. లాక్ డౌన్ సమయంలో మార్చి నుండి పడిపోయిన వసూళ్లు ఇప్పుడు పెరగడం గమనార్హం. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటడం ఆర్థిక వ్యవస్థ రికవరీకి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ, తెలంగాణ వాటా..
జీఎస్టీ రిటర్న్స్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి రూ.2480 కోట్లు, తెలంగాణ నుండి రూ.3383 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 26 శాతంగా ఉంది. తెలంగాణలో 5 శాతంగా నమోదయింది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.32,172 కోట్లకు క్షీణించాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.1,13,865 కోట్లు ఉంది. మే నెలలో రూ.62,151 కోట్లు, జూన్‌లో రూ.90,917 కోట్లు, జూలైలో 87,422 కోట్లు, ఆగస్ట్‌లో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లు వసూలు కాగా, అక్టోబర్ నెలలో రూ.1,05,155 వసూలయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications