GST News: జీఎస్టీని దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలని కేంద్రం చూస్తోంది. దీనికోసం కొత్తగా ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. దీంతో కోటీశ్వరులుగా మారేందుకు సదవకాశం లభించనుంది.
రక్షాబంధన్‌తో దేశంలో పండుగలు ప్రారంభమయ్యాయి. పండుగల సమయంలో ప్రజలు పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అంటే మీరు రాబోయే నెలల్లో షాపింగ్ చేస్తే.. ఖచ్చితంగా దుకాణదారుల నుంచి బిల్లు తీసుకోండి. ఎందుకంటే ఈ బిల్లు మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు.

కేంద్రం తాజాగా జీఎస్టీ రివార్డ్స్ స్కీమ్.. మేరా బిల్ మేరా అధికార్ ను ప్రారంభించింది. దీనిని తొలుత దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శుక్రవారం ప్రారంభించబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైజ్ మనీ కోసం కేంద్రం, రాష్ట్రాలు రూ.30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి. ఈ పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు.
జీఎస్టీ లక్కీ డ్రా ప్రైజ్ మనీకి కేంద్రం, రాష్ట్రాలు సమానంగా సహకరిస్తాయని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. తొలి దశలో ఇది అసోం, గుజరాత్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూలలో ప్రారంభించబడింది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం ప్రతినెల 810 లక్కీడ్రాలు ఉంటాయని కేంద్రం వెల్లడించింది. అలాగే ప్రతి త్రైమాసికంలోనూ రెండు బంపర్ లక్కీడ్రాలు ఉంటాయి.
వినియోగదారులు తమ GST బిల్లులను యాప్ ద్వారా అప్‌లోడ్ చేయడం ద్వారా పథకంలో చేరవచ్చు. లక్కీ డ్రాల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని బహుమతులను గెలుచుకోవచ్చు. నెలవారీ డ్రాలో 800 మందికి రూ.10,000, 10 మందికి రూ.10 లక్షలు బహుమతిగా అందిస్తారు. ప్రతి త్రైమాసికంలో కోటి రూపాయల బంపర్ డ్రా ఉంటుంది.


Click it and Unblock the Notifications