న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని ఆవరించుకున్నప్పటి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లాగే- దాని తీవ్రత తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పట్టాలెక్కుతోంది. గాడిన పడుతోంది. రోజువారీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకుంటోన్నాయి. అన్ని రంగాలు కూడా కుదుట పడుతున్నాయి. దీనికి నిదర్శనమే- కిందటి నెల అంటే అక్టోబర్‌లో వసూలైన వస్తు, సేవా పన్నుల వసూళ్ల. కిందటి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు వసూలయ్యాయి.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత.. రెండో అత్యధికం..
అక్టోబర్‌లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,30,127 కోట్ల రూపాయలు. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత.. ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1,41,384 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. అది హయ్యెస్ట్. కిందటి నెలలో రెండో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు నమోదు అయ్యాయి. జీఎస్టీ రూపంలో 1,30,127 కోట్ల రూపాయలు అందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

స్టేట్ జీఎస్టీ వాటా ఎక్కువ..
అంతకుముందు నెల అంటే సెప్టెంబర్‌తో పోల్చుకుంటే జీఎస్టీ వసూళ్లల్లో 24 శాతం మేర పెరుగుదల చోటు చేసుకుంది. ఈ మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ (CGST)-23,861 కోట్ల రూపాయలు. కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)-30,421 కోట్ల రూపాయలు. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 67,361 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 29,599 కోట్ల రూపాయలు.

మళ్లీ గాడినపడ్డట్టే..
వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 8,484 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరుకుల దిగుమతులపై విధించిన సెస్ ద్వారా 699 కోట్ల రూపాయలను ఇందులోనే మిళితం చేసినట్లు తెలిపింది. లక్ష కోట్ల రూపాయలకుకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది జూన్ నెలను మినహాయించితే- ప్రతీనెలా జీఎస్టీ రూపంలో కేంద్రానికి అందుతోన్న ఆదాయం లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. జూన్‌లో ఈ సంఖ్య 92,849 రూపాయలకే పరిమితమైంది.

ఏపీలో గ్రోత్ రేట్ అధికం..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన జీఎస్టీ కలెక్షన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయి. ఏపీలో గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన జీఎస్టీ కలెక్షన్లు 2,480 కోట్ల రూపాయలు. కాగా ఈ ఏడాది అదే అక్టోబర్ నెలకు ఈ సంఖ్య పెరిగింది. 2,879 కోట్ల రూపాయల జీఎస్టీని నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చి చూస్తే- ఈ నెల16 శాతం మేర అధిక రెవెన్యూ సాధించింది.

తెలంగాణ 14 శాతం..
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో 14 శాతం మేర పెరుగుదల కనిపించింది. గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ నమోదు చేసిన జీఎస్టీ మొత్తం- 3,383 కోట్ల రూపాయలు. ఈ ఏడాది అదే అక్టోబర్ నెలకు 3,854 కోట్ల రూపాయలను అందుకుంది. ఈ రెండింటి మధ్య 14 శాతం పెరుగుదల నెలకొంది. జీఎస్టీ కలెక్షన్లలో మహారాష్ట్ర వాటా అధికం. 19,355 కోట్ల రూపాయల మేర వసూళ్లు నమోదయ్యాయి ఆ రాష్ట్రంలో. గత ఏడాది ఇదే అక్టోబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు 15,799 కోట్ల రూపాయలు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications