A Oneindia Venture

GST 2.0 తో మీ స్టార్టప్ కలలు నిజం అయ్యే సూపర్ ఛాన్స్… ఎందుకు ఈ అవకాశం మిస్ అవ్వకూడదు తెలుసా?

భారత దేశంలో వ్యాపార వాతావరణం మారబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న "GST 2.0" కొత్త సిస్టమ్, పాత పద్ధతుల కంటే చాలా సింపుల్గా ఉండబోతోంది. 5%, 18%, 40% స్లాబ్‌లతో సరళీకరించిన పన్ను వ్యవస్థ, 2024-25లో రికార్డు స్థాయిలో వసూలైన రూ. 22.08 లక్షల కోట్ల జిఎస్టీ కలిపి వ్యాపార రంగానికి పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు జిఎస్టీ చెల్లింపుదారులు 2017లో 66.5 లక్షల నుండి 1.51 కోట్లకు పెరగడం, ఈ మార్పు ఎంత ప్రభావం చూపనుందో చూపిస్తుంది.

ఈ కొత్త వ్యవస్థ ద్వారా స్టార్టప్‌లు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు (SMEs) తమ పనిని సులభతరం చేసుకోవచ్చు. పన్ను ఫైలింగ్ టెన్షన్ తగ్గిపోవడంతో, వ్యాపార విస్తరణకు దారులు తెరవబడతాయి. తయారీ, సేవలు, ఎగుమతుల రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించబోతున్నాయి. జీడిపీలో ప్రతి ఏడాది 0.5-0.8 శాతం వృద్ధి ఈ మార్పుల వల్ల రావచ్చని అంచనా.

GST 2 0 The Game-Changer for Startups and SMEs in India

చిన్న వ్యాపారాలకు స్పెషల్ సపోర్ట్

రూ. 40 లక్షల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు పూర్తి మినహాయింపు, డిజిటల్ ఇన్వాయిసింగ్, రంగాల వారీగా స్లాబ్ తగ్గింపులు లభిస్తున్నాయి. SMEsకి తక్కువ డాక్యుమెంటేషన్, వేగవంతమైన ఎగుమతి రిఫండ్‌లు వంటి సౌకర్యాలు వర్కింగ్ క్యాపిటల్‌ అందుబాటులో ఉంచుతాయి.

మరియు, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ రద్దు, డిజిటల్ టూల్స్, ఎగుమతిదారులకు సపోర్ట్ వంటి కొత్త సంస్కరణలు, వ్యాపారాలకు కొత్త ఊపిరి ఇస్తాయి. ప్రారంభ దశలో డిజిటల్ అడాప్షన్ ఖర్చులు, ధరల సర్దుబాటు సమస్యలు ఉన్నా, దీర్ఘకాలంలో లాభాలు చాలా ఎక్కువ.

ప్రాంతీయ ప్రభావం: హైదరాబాదు, బెంగళూరులో స్టార్టప్‌ల వృద్ధి

1. టెక్ స్టార్టప్‌లు & IT సర్వీసులు: హైదరాబాదు, బెంగళూరు IT, SaaS, AI స్టార్టప్‌ల ప్రధాన కేంద్రాలు. GST 2.0తో తక్కువ కంప్లయన్స్, వేగవంతమైన రిఫండ్స్ వల్ల నగదు ప్రవాహం సులభం అవుతుంది. ఇది స్టార్టప్‌లకు హైరింగ్, R&D, కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెంచడానికి సహాయపడుతుంది.

2. కొత్త వ్యాపారాలకు తక్కువ అడ్డంకులు: రూ. 40 లక్షల లోపు టర్నోవర్ మినహాయింపులు, రూ. 5 కోట్లు వరకు తక్కువ కంపోజిషన్ పన్ను, హైదరాబాద్ T-Hub, బెంగళూరు క్లస్టర్లలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మద్దతు ఇస్తాయి.

3. తయారీ & ఎగుమతి రంగంలో మద్దతు: హైదరాబాదు ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, బెంగళూరు హార్డ్ వేర్, ఇంజినీరింగ్ స్టార్టప్‌లు. వీటీ స్లాబ్‌లు 5%, 18%, 40%, వేగవంతమైన ఎగుమతి రిఫండ్స్ వలన ఇన్‌పుట్ ఖర్చులు తగ్గి, గ్లోబల్ మార్కెట్లో విస్తరించడం సులభం అవుతుంది.

స్టార్టప్‌లు పెరగడం వలన కొత్త ఉద్యోగాలు, రాష్ట్ర GST ఆదాయం, లోకల్ ఆర్థిక వ్యవస్థ బలపడటం జరుగుతుంది. టైర్ 2 నగరాలైన వరంగల్, విజయవాడ, మైసూరు, హుబ్బలి ఇవ్వన్ని కూడా లాభం పొందుతాయి.

చిన్న వ్యాపారాల IT ఫైలింగ్ ఇబ్బందులు ఇక తగ్గిపోతాయి. అర్హత ఉన్న వ్యాపారాలు మూడు నెలలకు ఒకసారి రిటర్నులు ఫైల్ చేయవచ్చు, రూ. 5 కోట్లు లోపు టర్నోవర్ ఉన్నవారికి తక్కువ పన్ను రేట్లు వర్తిస్తాయి.

AI ఆధారిత ఇన్వాయిస్ రీకన్సిలియేషన్ సిస్టమ్ వల్ల ఫైలింగ్ తప్పులు తగ్గుతాయి, అంతే కాకుండా వేగవంతమైన ఇన్‌పుట్ క్రెడిట్ రిఫండ్‌లు నగదు ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, రూ. 3 కోట్ల టర్నోవర్ ఉన్న MSME, నెలవారీ ఫైలింగ్ కాకుండా త్రైమాసిక ఫైలింగ్ చేస్తే సమయం మరియు ఖర్చులు రెండింటినీ ఆదా చేయగలదు.

GST 2.0 ద్వారా స్టార్టప్‌లు, SMEs, హైదరాబాదు-బెంగళూరు వంటి స్టార్టప్ హబ్‌లు మరియు మొత్తం దేశ వ్యాపార వాతావరణంకు పెద్ద బూస్ట్ రాబోతుంది. తక్కువ పన్నులు, సులభమైన ఫైలింగ్, వేగవంతమైన రిఫండ్స్, డిజిటల్ టూల్స్ ఇలా అన్నీ కలిపి కొత్త వృద్ధి అవకాశాలు తెస్తాయి. రాబోయే రోజుల్లో భారతీయ వ్యాపార వాతావరణం అత్యంత సానుకూలంగా మారనుంది, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకి కూడా కొత్త ఊపిరి చేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+