జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం ఆటో మొబైల్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. ముఖ్యంగా చిన్న కార్లు, 350cc లోపు బైక్‌లు కొనే వారికి ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఎక్కువ ట్యాక్స్ వల్ల ఎంట్రీ-లెవెల్ మోడల్స్ కొందరికి అందని ద్రాక్షగా మారాయి. కానీ ఇప్పుడు ట్యాక్స్ తగ్గడంతో మళ్లీ డిమాండ్ పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు.

చిన్న కార్లపై భారీ రిలీఫ్
ఇకపై చిన్న కార్లపై జీఎస్టీ కేవలం 18% మాత్రమే. అంటే పెట్రోల్‌లో 1200cc లోపు, డీజిల్‌లో 1500cc లోపు ఇంజిన్ కలిగిన కార్లకు ఇది వర్తిస్తుంది. ముందుగా ఇవి దాదాపు 29-31% పన్ను చెల్లించాల్సి వచ్చేది. ట్యాక్స్‌లో ఈ 11% తగ్గింపు వల్ల ధరలు సుమారు 12-12.5% వరకు పడిపోతాయి. ఉదాహరణకు రూ. 5 లక్షల కారుపై కనీసం రూ. 60,000 వరకు తక్కువ ఖర్చవుతుంది.
బైక్ ప్రేమికులకు కూడా ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకు 28% ట్యాక్స్ ఉన్న 350cc లోపు బైక్‌లు ఇకపై 18% స్లాబ్‌లోకి వస్తాయి. అంటే కొత్త బైక్ కొనేటప్పుడు జేబు కొంత లైట్‌గా ఉంటుంది. ఉదాహరణకి, ఒక 350cc లోపు బైక్ ధర ₹2 లక్షలు అనుకుందాం. ఇంతకుముందు ఈ బైక్‌పై 28% జీఎస్టీ ఉండేది, అంటే సుమారు రూ. 56,000 పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జీఎస్టీ 18%కి తగ్గడంతో పన్ను కేవలం రూ. 36,000 మాత్రమే అవుతుంది. అంటే కేవలం ట్యాక్స్ తగ్గింపుతోనే కొనుగోలుదారుడు దాదాపు రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
SUVలు, లగ్జరీ కార్లు
పెద్ద కార్లు, SUVలు లేదా లగ్జరీ వాహనాలు కొనే వారికీ కొంతవరకు లాభమే. ఇప్పటి వరకు 43-50% సెస్ తో కలిపి మొత్తం పన్ను ఉన్నా, ఇప్పుడు 40% ఫిక్స్ చేశారు. అంతేకాదు, కార్ పార్ట్స్ అన్నీ 28% బదులు 18%కి దింపేశారు. దీని వల్ల వాహనాల మొత్తం ఖర్చు వాల్యూ చెయిన్ అంతా తగ్గే అవకాశం ఉంది. రిపేర్లు చేయించిన కూడా తక్కువే ఖర్చవుతుంది.
చిన్న కార్ల అమ్మకాలు గత కొన్ని ఏళ్లుగా పడిపోతున్నాయి. 2024-25లో అమ్మకాలు 13% తగ్గి 10 లక్షల యూనిట్లకు మాత్రమే చేరాయి. మరోవైపు SUVలు మాత్రం 10% పెరిగి 23.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించాయి. దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో చిన్న కార్ల వాటా 23.4%కి పడిపోయింది. ఇప్పుడు జీఎస్టీ తగ్గడంతో మళ్లీ చిన్న కార్ల మార్కెట్ రివైవ్ అవుతుందన్న ఆశ పెరిగింది.
జీఎస్టీ రేటు తగ్గించడం చిన్న కార్లకు పెద్ద ఊపునిస్తుంది. పండుగల సీజన్ ముందుకు రాబోతున్నందున ఎంట్రీ-లెవెల్ మోడల్స్‌పై డిమాండ్ తప్పకుండా పెరుగుతుంది. ఫ్రాంక్స్, పంచ్ వంటి చిన్న క్రాసోవర్స్ మరింత ఆకర్షణీయంగా మారతాయి అని S&P గ్లోబల్ మొబిలిటీ అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగాల్ ఇలా అన్నారు.
ఆటో సెక్టార్ భారత్ జీడీపీలో దాదాపు 7% వాటా కలిగి ఉంది. చిన్న కార్లపై పన్ను తగ్గింపుతో సేల్స్ పెరిగితే, మొత్తం ఆర్థిక వృద్ధికి పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న కార్ల డిమాండ్ పెరగడం వల్ల టైర్లు, బ్యాటరీలు, స్టీల్ పార్ట్స్ వంటి ఆటో కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్‌కి కూడా లాభం చేకూరే అవకాశం ఉంది.
ఆటో మార్కెట్ పుంజుకుంటే, ఆటో షోరూమ్‌లు, ఫైనాన్స్ కంపెనీలు, సప్లై చైన్ మొత్తం మీద కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. గత 2-3 ఏళ్లుగా స్లోడౌన్ కారణంగా ఆటో ప్లాంట్స్‌లో ఉత్పత్తి తగ్గినా, ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ లెవల్స్ మళ్లీ పెరిగే అవకాశముంది.
GST 2.0 ఆటో మార్కెట్లో ముఖ్యంగా బడ్జెట్ బైయర్స్‌కి రిలీఫ్ తెచ్చింది. చిన్న కార్లు, బైక్‌ల ధరలు తగ్గడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు మళ్లీ ఆటో షోరూమ్‌ల వైపు వెళ్తారని పరిశ్రమ నిపుణుల అంచనా. SUVలు, లగ్జరీ కార్లు కొంచెం చవక అవడం అదనపు ప్లస్.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications