కొత్త జీఎస్టీతో రూపాయి బదులు పైసలు తెరపైకి.. ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్న కస్టమర్లు..

భారతదేశంలో కొత్త GST 2.0 కొత్త స్లాబ్ పన్ను రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిన్న FMCG ప్యాక్‌ల ధరలు మారటం మొదలయ్యాయి. ఉదాహరణకి ప్రసిద్ధ పార్లే-జీ బిస్కెట్ చిన్న ప్యాక్ ముందుగా రూ. 5కి లభించేది, ఇప్పుడు రూ. 4.45కి పడింది. అదే విధంగా రూ. 1కి లభించే మిఠాయి 88 పైసలకు, రూ. 2 షాంపూ పౌచ్ రూ. 1.77 అయింది.

అయితే ఈ మార్పులు కంపెనీలకు కొత్త సవాళ్లను తీసుకొచ్చాయి. GSTకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఇంకా అస్పష్టంగా ఉండడం వల్ల.. FMCG కంపెనీలు తమ మునుపటి ధరలపై అయోమయంలో ఉన్నాయి. ప్రత్యేకంగా, ధరను తగ్గించకుండా ఉత్పత్తి పరిమాణాన్ని పెంచితే, ప్రభుత్వం దాన్ని ధర తగ్గింపుగా పరిగణిస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. కంపెనీలు స్పష్టత కోసం ప్రభుత్వం నుండి వివరణ కోరుతున్నారు.

GST 2 0 India FMCG price changes Rs 5 packs Rs 10 packs small FMCG packs FMCG GST reform budget FMCG products India consumer goods GST impact on FMCG FMCG price hike GST 2 0 FMCG 5 10 FMCG FMCG GST FMCG GST FMCG FMCG FMCG

దీనిపై పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా మాట్లాడుతూ.. ప్రారంభంలో కొన్ని ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని, కానీ వినియోగదారులు UPI ద్వారా పూర్తి చెల్లింపులు చేస్తారని లేదా పెద్ద ప్యాక్‌లను కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. ఎక్కువ కొనుగోలు పెంచడం ద్వారా పన్ను తగ్గింపును వినియోగదారులకు అందించడానికి అనుమతి లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. మోండేలెజ్ కంపెనీ కూడా తన ఉత్పత్తుల ధరలను మార్చింది. ఉదాహరణకి.. బోర్న్‌విటా రూ. 30 నుండి రూ. 26.69కి, ఓరియో బిస్కెట్లు రూ. 10 నుండి రూ. 8.90కి, 5 స్టార్ రూ. 20, జెమ్స్ ప్యాక్ రూ. 17.80కి మారాయి. కంపెనీలు తమ GST ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

చిన్న ప్యాక్‌లకు (రూ. 5, రూ.10, రూ. 20) ప్రత్యేక డిమాండ్ ఉంది. షాంపూ ప్యాక్‌లలో ఇవి 79 శాతం, బిస్కెట్లలో 64 శాతం, చాక్లెట్లలో 58 శాతం, స్నాక్స్‌లో 44 శాతం, టూత్‌పేస్ట్‌లలో 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కంపెనీలు పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు ఇవ్వడం కోసం స్టాక్‌లపై సుమారు 13 శాతం తగ్గింపు ఇచ్చారు.

RSPL గ్రూప్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. కొన్ని చిన్న ధరలు స్వల్పకాలంలో తగ్గుతాయి, కానీ దీర్ఘకాలంలో ప్యాక్ బరువు పెరుగుతుంది. పాత ధరలకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త స్టాక్ కోసం సరళమైన విధానాన్ని అనుసరించడం ఇప్పుడు పరిశ్రమకు ప్రధాన సవాలుగా ఉందని తెలిపారు.

క్లుప్తంగా చెప్పలంటే GST 2.0 రిఫాం వల్ల FMCG కంపెనీలు చిన్న ప్యాక్‌ల ధరలను సర్దుబాటు చేస్తూ.. వినియోగదారులకు పన్ను ప్రయోజనాలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, పద్దతులు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేవు కాబట్టి పరిశ్రమకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

కేంద్రం ఇప్పటి వరకు అమలులో ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేస్తూ, రెండు శ్లాబుల వ్యవస్థ 5 శాతం, నిల్ రేటును ఆమోదించిన సంగతి విదితమే. ఈ మార్పుతో అనేక ముఖ్యమైన వస్తువులపై పన్ను తగ్గింది.రోజువారీగా ఉపయోగించే UHT పాలు, ప్యాకేజ్డ్ పనీర్, పిజ్జా బ్రెడ్, చపాతీ, పరాఠా వంటి ఆహార పదార్థాలు ఇకపై పూర్తిగా పన్ను రహితంగా లభించనున్నాయి. అంతే కాకుండా, ప్రాణాలను రక్షించే మందులైన అగల్సిడేస్ బీటా, ఇమిగ్లూసెరేస్, డరాటుముమాబ్, అటెజోలిజుమాబ్ వంటి అత్యవసర ఔషధాలపై కూడా జీఎస్టీ పూర్తిగా రద్దు అయింది. విద్యార్థుల కోసం పెన్సిళ్లు, ఎరేజర్లు, వ్యాయామ పుస్తకాలు, మ్యాప్‌లు, గ్లోబులు, పూతలేని కాగితం వంటి విద్యా సామగ్రి ఇకపై జీరో పన్నుతో అందుబాటులో ఉంటుంది.

దీంతో పాటుగా అనేక వస్తువులు అధిక రేట్ల నుండి తగ్గించి 5 శాతం స్లాబ్‌లోకి మార్చబడ్డాయి. వీటిలో కండెన్స్డ్ మిల్క్, వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాస్తా, నూడుల్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీం, ప్యాక్ చేసిన నీరు వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. వ్యక్తిగత వినియోగ వస్తువులైన షాంపూ, టూత్‌పేస్ట్, సబ్బులు, టాల్కమ్ పౌడర్ వంటి ఉత్పత్తులు కూడా ఇకపై 5 శాతం పన్నుతోనే లభించనున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+