ఖాళీ ప్లాట్‌లో ఇల్లు కట్టడం లాభమా.. లేక గెటెడ్ కమ్యూనిటీలో కొనడం మంచిదా.. GST 2.0 తర్వాత ఏది బెస్ట్

సొంత ఇంటి కల ఎవరికి లేదు చెప్పండి! కానీ ఇల్లు కట్టడం అంటే పెద్ద ఖర్చు. ఈ ఖర్చులో మెజర్ పార్ట్ వచ్చేసరికి "నిర్మాణ సామగ్రి" నుంచే ఉంటుంది. సిమెంట్, ఇటుకలు, మార్బుల్, గ్రానైట్, బోర్డులు ఇలా ఇవ్వన్నీ కొనాలంటే GST వల్ల భారీ బరువు మనకి పడుతుంది.

GST 2 0 Is Building a Home on Your Own Plot Cheaper Than a Gated Flat

అయితే, తాజాగా GST కౌన్సిల్ 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. సిమెంట్‌పై ఉన్న GST రేటు 28% నుంచి 18%కి తగ్గింది. అలాగే మార్బుల్, గ్రానైట్, ఇటుకలపై కూడా GST తగ్గించారు. దీని వల్ల ఇల్లు కట్టేవారికి నేరుగా సేవింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎంత సేవ్ అవుతుందో చూద్దాం: ఒక 1,000 sq.ft ఇల్లు కట్టాలని అనుకుందాం. దాదాపు రూ. 30 లక్షల ప్రాజెక్ట్ అవుతుంది. ఇందులో సిమెంట్ ఖర్చు 16%, ఇటుకలు 4%, గ్రానైట్ 0.5%, బోర్డులు 1%.

GST తగ్గింపుతో:

* సిమెంట్‌పై దాదాపు రూ. 80,000 సేవ్
* ఇటుకలపై రూ. 1.2 లక్షలు
* గ్రానైట్‌పై రూ. 15,000
* బోర్డులపై రూ. 30,000

అన్నీ కలిపి దాదాపు రూ. 60,000-రూ. 70,000 సేవ్ అవుతుంది. అంటే మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 2% మాత్రమే. ఇది చాలా పెద్ద మొత్తం కాకపోయినా, ఫినిషింగ్, లోన్ ఇఎంఐ లేదా ఇంటీరియర్‌లో చిన్న ఎక్స్‌ట్రా వర్క్ చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

కాంట్రాక్టులు ఎలా ఉంటే లాభం?

ఇల్లు కట్టేటప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి.

1. మటీరియల్స్ వేరు కొనుగోలు చేసి, కూలీలను వేరు కాంట్రాక్టుగా పెట్టుకోవడం: ఇక్కడ మీరు సిమెంట్, ఇటుకలు, స్టీల్, గ్రానైట్, బోర్డులు అన్నీ మీరే మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తారు. తర్వాత కూలీలకు వేరుగా డబ్బు చెల్లించి పనులు చేయిస్తారు. ఇలా చేస్తే, GST తగ్గింపు వల్ల వచ్చిన మొత్తం లాభం నేరుగా మీకే వస్తుంది. ఉదాహరణకు సిమెంట్‌పై 28% GST నుంచి 18%కి తగ్గింది కాబట్టి, బస్తా మీద మీరు తక్కువ GST కడతారు. దీని వల్ల లెక్కల మీద మంచి సేవింగ్ వస్తుంది.

2. కాంపోజిట్ కాంట్రాక్ట్ (మటీరియల్ + లేబర్ కలిపి):
ఇది చాలా మంది తీసుకునే ఆప్షన్. అంటే కాంట్రాక్టర్‌నే మీరు హైర్ చేస్తారు, ఆయనే మటీరియల్స్ కొనుగోలు చేసి, లేబర్‌ను పెట్టి మొత్తం ఇల్లు కడతాడు. మీకు టెన్షన్ ఏమీ ఉండదు, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పటివరకు ఈ "కాంపోజిట్ కాంట్రాక్ట్" మీద GST 12% ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం ఇది 18%కి పెరిగింది. అంటే మీరు సిమెంట్‌ మీద సేవ్ చేసిన రూ. 70,000-రూ. 80,000 లాభం చివర్లో కాంట్రాక్ట్ బిల్లులో అదనంగా GSTగా పోయే ఛాన్స్ ఉంది.

అందుకే చాలా మంది నిపుణులు చెబుతున్నది ఏమిటంటే మీరు నిజంగా సేవింగ్ కావాలనుకుంటే, మటీరియల్స్ మీరే కొనుగోలు చేసి, కూలీలను వేరు కాంట్రాక్టుగా పెట్టుకోవడం మంచిది. అలా చేస్తే GST తగ్గింపులన్నీ మీకు నేరుగా లాభం అవుతాయి.
ఉదాహరణకి, మీ ఇంటి కాంట్రాక్ట్ విలువ రూ. 18 లక్షలైతే, 6% అదనంగా అంటే రూ. 1.08 లక్షలు మళ్లీ ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు సేవ్ చేసిన రూ. 70,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్ ఎక్కువగా వర్క్ కాంట్రాక్ట్ కింద వస్తాయి. కాబట్టి అక్కడ GST పెరుగుదల లాభాన్ని తగ్గించే అవకాశం ఉంది.

నిజం చెప్పాలంటే, GST తగ్గింపులు "బిగ్ గేమ్‌చేంజర్" లా కనిపించవు. కానీ, కొంతవరకు సహాయం చేస్తాయి. గ్రేటర్ నోయిడా లాంటి నగరాల్లో 1,000 sq.ft ఇల్లు కట్టడానికి sq.ftకి రూ. 2,800-రూ. 3,500 ఖర్చు అవుతుంది. అంటే మొత్తం రూ. 28- రూ.35 లక్షలు. ఈ మొత్తంలో రూ. 70,000 సేవ్ అవడం చిన్న విషయం అనిపించినా, ఆ సమయంలో చాలా హెల్ప్ అవుతుంది.

నిపుణుల మాట ప్రకారం "సప్లయర్లు GST తగ్గింపుల లాభం వినియోగదారులకు పాస్ చేస్తే, ఇల్లు కట్టడంలో ఖర్చు తగ్గుతుంది. క్వాలిటీని తగ్గించకుండా బిల్డర్లు కూడా లాభం చూపించగలరు," అంటున్నారు రోహిత్ అస్తానా (అల్ట్రాటెక్ టెక్స్చర్ పెయింట్స్). కానీ వర్క్ కాంట్రాక్టులపై GST పెరగడం వల్ల ఈ లాభం అంతగా అనిపించకపోవచ్చు అని రాహుల్ సింగ్ చెబుతున్నారు రాహుల్ సింగ్.

ఇల్లు కట్టే ప్లాన్ ఉన్నవారికి GST 2.0 కొంత ఊరట ఇచ్చినా, ఇది పెద్ద తేడా ఏమి చెయ్యదు. కానీ మటీరియల్ వేరు కొనుగోలు చేసి, లేబర్ వేరు కాంట్రాక్ట్ చేసుకుంటే మాత్రం మీకు నిజంగా సేవింగ్ ఉంటుంది. మొత్తానికి, GST తగ్గింపు వల్ల ఇల్లు కట్టడం కాస్త చవకవుతుందనిపించినా, గేటెడ్ ఫ్లాట్ కొనుగోలు కంటే పెద్ద తేడా మాత్రం రాదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+