ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 కు మద్దతు లభించింది. రాష్ట్రానికి రూ. 8 వేల కోట్ల మేర ఆదాయ నష్టం వస్తుందని అంచనా ఉన్నా, ప్రజా సంక్షేమం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ GST-2.0 సంస్కరణలకు సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ముక్తకంఠంతో ఆమోదించారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఈ సంస్కరణలు సమాజంలోని ప్రతి వర్గానికీ మేలు చేస్తాయని స్పష్టం చేశారు. కొత్త జీఎస్టీ వల్ల రోజువారీ ఉపయోగించే సబ్బు, టూత్‌పేస్ట్, నెయ్యి వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, విద్యుత్ పరికరాలపై పన్ను తగ్గడంతో గ్రామీణ కుటుంబాలకు ఊరట కలుగుతుందని సభ్యులు చెప్పారు.

GST కౌన్సిల్ 56వ సమావేశంలో కేంద్రం చేపట్టిన పన్ను సంస్కరణలను రాష్ట్రం స్వాగతించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సంస్కరణలను వేగవంతంగా అమలు చేసినందుకు ప్రశంసిస్తూ.. జీఎస్‌టి 2.0 ను ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తద్వారా జీఎస్టీకి మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త GST అమల్లోకి రానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, MLCలు, MPs ఈ ప్రచారంలో పాల్గొని ప్రజలకు సంస్కరణల ప్రయోజనాలను వివరించడానికి ప్రయత్నిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, నిత్యావసర వస్తువుల - సబ్బులు, టూత్‌పేస్ట్, నెయ్యి ధరల తగ్గింపును హైలైట్ చేయనున్నారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలను GST నుండి మినహాయించడం ద్వారా రాష్ట్రం రూ.750 కోట్ల ఆదా పొందుతుంది. వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పన్ను తగ్గింపుల ద్వారా లాభపడతాయి, రైతులు, వినియోగదారులకు మద్దతు అందుతుందని సీఎం తెలిపారు.
2017లో ప్రవేశపెట్టిన GST ఫ్రేమ్‌వర్క్ 17 పన్నులు, 13 సెస్సులను సరళీకృతం చేసింది. GST 2.0 ద్వారా భారతదేశం రెండంకెల వృద్ధి వైపు పరుగులు పడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జిఎస్టి సంస్కరణలు ప్రజలకు పండుగ బోనస్, సంపద, సంక్షేమాన్ని ఇస్తాయన్నారు. దసరా నుండి దీపావళి వరకు ప్రజలకు ప్రయోజనాలు చేరేలా రాష్ట్రం ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సంస్కరణలను ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జీఎస్టీ వల్ల వచ్చే తక్షణ లాభనష్టాలకే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాలను కూడా మనం చూడాలి. ఇది నిజంగా దేశానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగితే, అభివృద్ధి వేగవంతం అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అన్నారు. జీఎస్టీ అమలులో ఇప్పటివరకు 5%, 12%, 18%, 28% అనే నాలుగు స్థాయిల పన్ను నిర్మాణం ఉండటంతో కొన్ని ఉత్పత్తులపై గందరగోళం కలిగిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఏ వస్తువుపై ఎంత పన్ను పడుతుందో అర్థం చేసుకోవడం ప్రజలకు, వ్యాపారులకు సవాలుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
కొత్తగా తీసుకొస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తాయి.పన్ను వ్యవస్థలో ఉండే అస్పష్టతలు తగ్గిపోతాయి. వ్యాపారులకు స్పష్టత వస్తుంది. దీని వలన ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో సరుకు ధరలు తగ్గుతాయి, వినియోగదారుల భారం తగ్గుతుంది.జీఎస్టీ సంస్కరణలు కేవలం పన్ను మార్పులు మాత్రమే కాదు. ఇవి దేశ ఆర్థిక శక్తిని మరింత బలపరుస్తాయి. భవిష్యత్తులో భారతదేశం రెండంకెల వృద్ధి రేటుతో ముందుకు వెళ్లడానికి ఇది కీలకంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications