మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన GST 2.0 రేట్ కట్ మొదటి రోజే జనాలకి బంపర్ లాభం ఇచ్చింది. కారు షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల రద్దీ చూసి ఆటోమొబైల్ రంగం ఊపిరి పీల్చుకుంది. కార్ల ధరలు తగ్గడంతో షోరూమ్‌ల దగ్గర రద్దీ పెరిగిపోయింది. ఈ ఊపులోనే హ్యుందాయ్ ఒక్క రోజులో దాదాపు 11,000 కార్లు డెలివర్ చేసి, గత ఐదేళ్లలోనే హయ్యెస్ట్ సేల్స్ డే రికార్డు నమోదు చేసిందని డైరెక్టర్ & COO తరుణ్ గార్గ్ చెప్పారు.
దేశంలోనే నెం.1 ఆటో కంపెనీ మారుతి సుజుకి మరియు నెం.2 హ్యుందాయ్ ఇండియా, ఈ రెండు బ్రాండ్లు కలిసి ఏళ్ల తరబడి చూడని రికార్డు సేల్స్ సాధించాయి. GST 2.0 వల్ల చిన్న కార్ల ధరలు తగ్గడంతో, నవరాత్రి మొదటి రోజునే పబ్లిక్ షోరూమ్‌లకి లైన్ పెట్టేశారు.

మారుతి సుజుకి:
నెం.1 ఆటో కంపెనీ అయిన మారుతి ఒక రోజులోనే 80,000 కస్టమర్ విచారణలు, 30,000 కారు డెలివరీలు చేసింది. ఇది కంపెనీ 35 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక నంబర్. సెప్టెంబర్ 18 కొత్త ధరలు ప్రకటించినప్పటి నుంచి, రోజూ 15,000 బుకింగ్‌లు వస్తున్నాయి. ఇది నార్మల్ కంటే 50% ఎక్కువ.
కంపెనీ ఆఫీసర్ పార్థ బెనర్జీ మాట్లాడుతూ "చిన్న కార్ల డిమాండ్ పీక్స్ లో ఉంది. కొన్ని మోడల్స్ కి స్టాక్ అవుట్ అయ్యే అవకాశం ఉంది" అన్నారు.
హ్యుందాయ్:
నెం.2 ఆటో కంపెనీ అయిన హ్యుందాయ్ కూడా వెనుకబడలేదు. ఒకే రోజు 11,000 డీలర్ బుకింగ్స్ చేసుకుని, గత 5 ఏళ్లలోనే బెస్ట్ "డే రికార్డు" కొట్టేసింది. కస్టమర్ ట్రస్ట్, ఫెస్టివ్ సీజన్ ఎఫెక్ట్ బలంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ అలాగే కొనసాగుతుంది" అని COO తరుణ్ గార్గ్ చెప్పారు.
టాటా మోటర్స్:
టాటా మోటర్స్ ప్యాసెంజర్ వాహనాలు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ చెప్పారు, రేట్లు తగ్గడం, ప్రత్యేక ఆఫర్లు తీసుకురావడం వల్ల విచారణలు, బుకింగ్‌లు, షోరూమ్‌లో వాక్-ఇన్‌లు బాగా పెరిగాయి. కొనుగోలు కార్ల మార్పిడి కూడా ఎక్కువగా ఉంది. నవరాత్రి శుభ ప్రారంభంతో రిటైల్ సేల్స్ రికార్డు సాధిస్తామని భావిస్తున్నాం.
ఇది డొమెస్టిక్ ప్యాసెంజర్ వాహన పరిశ్రమ కోసం సానుకూల సంకేతం. గత కొన్ని నెలల్లో సేల్స్ బాగా పడిపోయి, ఇయర్‌లో మొత్తం పెరుగుదల సుమారు 1-4% మాత్రమే ఊహించబడింది. కానీ, సరికొత్త GST కట్ వల్ల వృద్ధి రేటు ఇప్పుడు 5-7% వరకు రావచ్చని అనుకుంటున్నారు.
ఇదే తరుణంలో, S&P గ్లోబల్ మొబిలిటీ కూడా 2026 కోసం ముందస్తు అంచనాలు పెంచింది. అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగాల్ ఏమని చెప్పరు అంటే, "తదుపరి క్యాలెండర్ ఇయర్ ఉత్పత్తిలో 2 లక్ష వాహనాలు చేర్చడం, దాదాపు 3-4% వృద్ధి సాధించడం జరుగుతుంది. సేల్స్‌లో 1 లక్ష వాహనాలు కొత్తగా జోడించడం ద్వారా మొత్తం వృద్ధి రేటు సుమారు 8% వరకు చేరవచ్చు.
సాధారణంగా చిన్న కార్లు కొనుగోలు చేసే మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఈ GST 2.0 తగ్గింపు పెద్ద లాభం ఇచ్చింది. చిన్న కార్ల పన్ను 28% నుంచి 18%కి తగ్గినందున, కొంతమంది కస్టమర్లు ఇప్పటి వరకు వాయిదా పెట్టి ఉంచిన బుకింగ్‌లు కూడా ఇప్పుడు కొనసాగించడానికి ప్రేరణ పొందారు. ఇక, నవరాత్రి ఉత్సవ సీజన్ సందర్భంగా షోరూమ్‌లు ప్రత్యేక ఆఫర్లు, ఫెస్టివ్ డిస్కౌంట్లు ప్రకటించడంతో, కస్టమర్లకు కేవలం ధరే కాకుండా మరింత విలువ ఇచ్చే అవకాశం వచ్చింది. GST 2.0 రేట్ కట్ మరియు ఫెస్టివ్ ఆఫర్లు కలసి మార్కెట్‌లో నిజంగా ఒక శక్తివంతమైన "మినీ బూమ్"ను సృష్టించాయి. ఈ రెండింటి కలయిక వల్ల కస్టమర్లకే లాభం కాక, కంపెనీలకు కూడా సేల్స్ రికార్డులు కొట్టే అవకాశం వచ్చింది.
సెప్టెంబర్ 4న ప్రభుత్వం "GST సిస్టమ్‌ను సింప్లిఫై" చేస్తూ, నాలుగు స్లాబ్స్ 5%, 12%, 18%, 28%ని రెండు స్లాబ్స్ 5% & 18%కి తగ్గించింది. చిన్న కార్ల కోసం, అంటే 4 మీటర్లలోపు, 1,200 సీసీ పెట్రోల్ లేదా 1,500 సీసీ డీజిల్, వాటిని పాత 28% బదులు ఇప్పుడు 18% GST లోకి మార్చారు. పెద్ద కార్లకు 40% ట్యాక్స్ ఉన్నా, ఇది పాత 50% టోటల్ కంటే తక్కువే.
GST 2.0 మొదటి రోజే కారు మార్కెట్‌కి పండగ వాతావరణం తీసుకువచ్చింది. నవరాత్రి మొదటి రోజునే మారుతి, హ్యుందాయ్ లాంటి బ్రాండ్లు రికార్డులు కొట్టేయడంతో, ఈ సీజన్‌లో ఆటో రంగం ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications