GST 2.0 తొండరాలో రానుంది, కౌన్సిల్ త్వరలో సమావేశమై కొత్త రిఫార్మ్‌లను చర్చించనుంది. ఈ కొత్త సవరణల ముఖ్య ఉద్దేశ్యం టాక్స్ రేట్లను సింప్లిఫై చేయడం, స్లాబ్‌లను తగ్గించడం, ప్రాసెస్ సులభతరం చేయడం తద్వారా వినియోగదారులు మరియు వ్యాపారాలకి సులభంగా చేయడం.

టాక్స్‌లు తగ్గితే వస్తువులు చవకగా దొరుకుతాయి,వినియోగం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థకు చిన్న ప్రేరణ కూడా వస్తుంది. కానీ, GST మీద ఎక్కువ ఆధారపడే రాష్ట్రాలు, ముఖ్యంగా వారి ఆదాయంలో GST వంతు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ఆదాయ లోటును ఎదుర్కోవచ్చు. SBI, అంబిట్ క్యాపిటల్ అంచనాల ప్రకారం, కేంద్రం మరియు రాష్ట్రాల కలిపి మొత్తం వార్షిక నష్టం రూ.70,000 కోట్ల నుంచి రూ.1.8 లక్షల కోట్లు వరకు ఉండవచ్చు. అంబిట్ క్యాపిటల్ దీన్ని ఒక "ఫిస్కల్ స్టిమ్యులస్"గా చూస్తోంది. రిపోర్ట్ ప్రకారం, GST రేటు తగ్గింపులు ఆదాయపు పన్ను తగ్గింపుల కంటే బలమైన ప్రేరణ. ధరలు వినియోగదారులకు చేరితే, GDP 20-50 బేసిస్ పాయింట్లు పెరగొచ్చు.
అయితే అన్ని రాష్ట్రాలు సమానంగా ప్రభావం ఎదుర్కోవు. బేకర్ టిల్లీ ASA ఇండియా నుండి సందీప్ గుప్తా చెప్పినట్టు, వినియోగంపై ఆధారపడి ఉన్న రాష్ట్రాలు ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు, కొంత లాభం పొందవచ్చు. కానీ అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పంజాబ్, బీహార్, వెస్టు బెంగాల్ ఎక్కువ ఒత్తిడిలో ఉంటాయి. ఎందుకంటే 40% పైగా టాక్స్ ఆదాయం GST ద్వారా వస్తుంది. మహారాష్ట్ర తాత్కాలిక లోటు ఎదుర్కోవచ్చు.
BDO India లో ఇన్డైరెక్ట్ టాక్స్ పార్టనర్ కార్తీక్ మణి చెప్పినట్టు, ఈ రేటు తగ్గింపు ప్రధానంగా రోజువారీ వినియోగ వస్తువులపై దృష్టి పెట్టడంతో, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఉదాహరణకు
ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కువ ప్రభావం అనుభవిస్తాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా దేశంలో పెద్ద GST కాన్ట్రిబ్యూటర్స్ కాబట్టి పెద్ద మొత్తంలో ఆదాయ లోటు ఎదుర్కోవచ్చు. కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ GST ఆదాయంలో 30-40% దానిపై ఆధారపడే రాష్ట్రాలు, నిష్పత్తిగానే ఎక్కువ ప్రభావం చూపుతాయి.
ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే, GST కంపెన్సేషన్ సెస్ అక్టోబర్‌లో ముగియనుంది. ఒకరకంగా, ఇది రాష్ట్రాలను ఆదాయ నష్టాల నుంచి రక్షించడానికి ఉంది, కానీ ఇప్పుడు Covid సమయంలోని లోన్లను చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు లోటు పూరించడానికి ఇతర మార్గాలు కనుక్కోవాలి.
రాష్ట్రాలు ఎలా ఎదుర్కోవాలి? కార్తీక్ మణి చెప్పినట్టు, రేటు తగ్గింపుల వల్ల వినియోగం పెరగడం ద్వారా కొంత పరిష్కారం వస్తుందనే ఆశ ఉంది. సైన్ గూడ్స్ కోసం 40% టాక్స్ స్లాబ్ ద్వారా కొంత పరిహారం ఆశించవచ్చు. రాష్ట్రాలు టాక్స్ లీకేజీలపై కఠినంగా పర్యవేక్షణ చేయవచ్చు. అదనంగా, ఇంధనం, మద్యం వంటి వస్తువులపై పన్ను పెంచడం ద్వారా నష్టం కొంత తగ్గించవచ్చని చెబుతున్నారు.
సెప్టెంబర్ 3-4 GST కౌన్సిల్ సమావేశం కీలకంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు చెప్పిన రేటు తగ్గింపులకు వ్యతిరేకంగా ఉండవచ్చు లేదా అదనపు పరిహారం కోరవచ్చు, ముఖ్యంగా GST ఆదాయంపై ఎక్కువ ఆధారపడే రాష్ట్రాలు. GST కౌన్సిల్ weighted voting వ్యవస్థలో, కేంద్రం ఓటు 1/3, రాష్ట్రాలు కలిపి 2/3. 75% weighted ఓట్ల అవసరం. కొన్ని రాష్ట్రాలు అంగీకరించకపోయినా, కేంద్రం మరియు ఇతర రాష్ట్రాల మెజారిటీ ఇస్తేనే ప్రతిపాదన ఆమోదం పొందవచ్చు.
సారాంశంగా, కన్సెన్సస్ తప్పనిసరి. లేకపోతే, GST 2.0 అమలు ఆలస్యంగా జరుగుతుంది, వ్యాపారాలు, వినియోగదారులకు స్పష్టత లేకుండా ఉంటుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications