పండుగల సీజన్‌కి ముందే వినియోగదారులకు శుభవార్త అందింది. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో పలు ఉత్పత్తులపై పన్ను తగ్గింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న జరిగిన ఈ మీటింగ్‌లో ఆమోదం పొందిన నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో అనేక వస్తువులు చవక అవుతుండగా, కొన్ని రంగాల్లో మాత్రం పన్ను భారంలో ఎలాంటి మార్పులు లేవు. అయితే మరికొన్ని రంగాల్లో మాత్రం ట్యాక్స్ రేట్లు యథావిధిగా కొనసాగుతాయి.

GST 2.0లో ఏవి చవకగా వస్తునాయి
ఆహారం & డైలీ ఉపయోగపడే ఉత్పత్తులు:
జీఎస్టీ 2.0లో ఆహారం మరియు రోజువారీ వినియోగ ఉత్పత్తులపై పెద్ద తగ్గింపులు వచ్చాయి. పాలు ఉత్పత్తుల్లో UHT మిల్క్‌పై పన్ను 5% నుంచి పూర్తిగా రద్దు చేయబడింది. అలాగే కండెన్స్‌డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పనీర్, చీజ్ పన్ను రేట్లు 12% నుంచి 5% లేదా కొన్ని సందర్భాల్లో నిల్‌గా మారాయి. స్టేపుల్ ఫుడ్స్ కింద మాల్ట్, స్టార్చ్, పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులు 12-18% నుంచి 5%కి తగ్గాయి. డ్రైఫ్రూట్స్ & నట్స్ కేటగిరీలో బాదం, పిస్తా, హేజిల్‌నట్, జీడిపప్పు, ఖర్జూరం 12% నుంచి 5%కి తగ్గించబడ్డాయి. ఇక పంచదార, సిరప్స్, టాఫీలు, క్యాండీలు అన్ని 5% స్లాబ్‌లోకి వచ్చాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కింద వెజిటేబుల్ ఆయిల్స్, జంతు కొవ్వులు, స్ప్రెడ్స్, సాసేజ్‌లు, మాంసం, ఫిష్ ఉత్పత్తులు అన్నీ 5% స్లాబ్‌లోకి చేరాయి. అదేవిధంగా నమకీన్, భుజియా, మిక్చర్ పన్ను రేట్లు 18% నుంచి 5%కి తగ్గించబడ్డాయి. ఇంతేకాకుండా, మినరల్ వాటర్ మరియు ఏరేటెడ్ వాటర్ కూడా 18% బదులుగా ఇప్పుడు కేవలం 5% పన్నుతో లభించనున్నాయి.
వ్యవసాయం & ఎరువులు, హెల్త్‌కేర్ & ఎడ్యుకేషన్
జీఎస్టీ 2.0లో వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు కూడా ఉపశమనం లభించింది. ఎరువులపై పన్ను రేట్లు 12%/18% నుంచి 5%కి తగ్గించబడ్డాయి. విత్తనాలు మరియు పంటల కోసం ఉపయోగించే పోషక పదార్థాలు కూడా 12% నుంచి 5%కి తగ్గాయి. ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఊరట వచ్చింది. లైఫ్‌సేవింగ్ డ్రగ్స్, కొన్ని ముఖ్యమైన మెడికల్ డివైజ్‌లపై పన్ను రేట్లు 12%/18% నుంచి 5% లేదా కొన్ని సందర్భాల్లో పూర్తిగా జీరో కి వచ్చేసాయి.
కన్జ్యూమర్ గూడ్స్
జీఎస్టీ 2.0లో వినియోగదారుల రోజువారీ అవసరాలకు దగ్గరగా ఉన్న అనేక ఉత్పత్తులపై కూడా పన్ను తగ్గింపులు జరిగాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మాస్ యూజ్ లేదా ఎంట్రీ-లెవెల్ అప్లయెన్సులపై పన్ను 28% నుంచి 18%కి తగ్గింది. అలాగే ఫుట్‌వేర్, టెక్స్టైల్స్‌పై జీఎస్టీ 12% నుంచి 5%కి పడిపోయింది. విద్యార్థులు, కార్యాలయాల్లో ఉపయోగించే కొన్ని పేపర్ గ్రేడ్లు 12% నుంచి నిల్‌గా మారాయి. ఇక హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, డెంటల్ ఫ్లాస్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు 18% నుంచి 5% స్లాబ్‌లోకి వచ్చాయి.
ఆటో సెక్టార్
జీఎస్టీ 2.0లో ఆటో సెక్టార్‌కి కూడా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్న కార్లపై పన్ను రేటు 28% నుంచి 18%కి తగ్గింది, అలాగే 350cc లోపు బైక్‌లు కూడా ఇదే రేటుతో చవక కానున్నాయి. మరోవైపు, పెద్ద కార్లు, బిగ్ బైక్స్‌పై పన్ను 40%గా నిర్ణయించబడింది, అదనపు cess లేకుండా. కార్ పార్ట్స్ అన్నింటికీ జీఎస్టీ 18%గా చేయబడింది. ఇకపోతే, పర్యావరణానికి అనుకూలంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5% పన్నుతోనే కొనసాగుతాయి.
ఇతర రంగాలు
జీఎస్టీ 2.0లో ఇతర రంగాలకు కూడా ఊరట లభించింది. పునరుత్పత్తి శక్తి పరికరాలపై పన్ను 12% నుంచి 5%కి తగ్గించబడింది. అదే విధంగా, నిర్మాణ మెటీరియల్స్‌కి కూడా 12% నుంచి 5%కి తగ్గింపు లభించింది. ఇక క్రీడా వస్తువులు, బొమ్మలు 12% నుంచి 5%కి వస్తాయి. అలాగే లెదర్, వుడ్, హ్యాండిక్రాఫ్ట్స్ ఇప్పుడు నేరుగా 5% స్లాబ్‌లోకి వస్తాయి.
మొత్తానికి, కిరాణా వస్తువులు, ఎరువులు, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్, బొమ్మలు, రిన్యూవబుల్ ఎనర్జీ పరికరాలు ఇలా ప్రజల జీవితానికి దగ్గరగా ఉన్న వస్తువులు చవకగా మారనున్నాయి.
GST 2.0లో ఏవి ఖరీదు పెరుగుతాయి?
సిన్ గూడ్స్
పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, జర్దా, టొబాకో, బీడీలపై ఇప్పటివరకు ఉన్న అధిక పన్ను రేట్లు యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే ఇవి ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగా కాకుండా రిటైల్ సేల్ ప్రైస్ (RSP) ఆధారంగా లెక్కించబడతాయి. ఇకపోతే, షుగర్ కలిగిన డ్రింక్స్ మరియు ఏరేటెడ్ వాటర్స్‌పై పన్ను రేటు 28% నుంచి 40%కి పెంచబడింది.
లగ్జరీ & ప్రీమియం వస్తువులు
లగ్జరీ కార్లు, ప్రీమియం లిక్కర్, సిగరెట్లు అన్నీ 40% పన్ను స్లాబ్‌లోనే కొనసాగనున్నాయి. అయితే, రాష్ట్రపతి కార్యాలయం వంటి ప్రత్యేక సందర్భాల్లో దిగుమతి చేసే ఆర్మర్డ్ కార్లకు మాత్రమే ఈ రూల్ నుంచి మినహాయింపు ఇవ్వబడింది.
ఎనర్జీ & ఫ్యూయల్స్
బొగ్గు 5% నుంచి 18%కి పెరిగింది. ఇది బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఖర్చు పెరుగుతుంది.
సర్వీసులు
స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌లో పనిచేసే రెస్టారెంట్లు ఇకపై 18% ITC ఆప్షన్‌ను ఉపయోగించుకోలేవు. అదేవిధంగా, కొన్ని లాటరీలు మరియు ఇంటర్మీడియరీ సర్వీసులకు కొత్త వాల్యుయేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి, వీటి వల్ల పన్ను భారము యథాతథంగా ఉండవచ్చు లేదా మరింత పెరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న GST 2.0 వల్ల సాధారణ ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పాలు, బిస్కెట్లు, డ్రైఫ్రూట్స్, షాంపూ, టూత్‌పేస్ట్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్, ఎరువులు, లైఫ్‌సేవింగ్ మెడిసిన్స్, చిన్న కార్లు, ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రానిక్స్ లాంటి వస్తువులు చవక అవ్వడం వల్ల మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్‌కు ఉపశమనం లభిస్తుంది. రైతులకు ఎరువులు, విత్తనాలు చవక అవ్వడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. ఫెస్టివల్ సీజన్ ముందు వస్తువులు చవక అవ్వడం రిటైల్ మార్కెట్, ఈ-కామర్స్ సేల్స్ పెరగడానికి దోహదపడుతుంది. అయితే, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, చక్కెర ఉన్న డ్రింక్స్, బొగ్గు, లగ్జరీ కార్లు మాత్రం ఇంకా భారంగానే ఉంటాయి. అంటే ప్రజలకు అవసరమైన డైలీ యూజ్ ప్రొడక్ట్స్ తక్కువ ధరలో దొరకగా, లగ్జరీలు మరియు హానికరమైన ఉత్పత్తులు మరింత ఖరీదు కానున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications