GRT Jewellers: విజయవాడ ప్రజలకు అందుబాటులో జీఆర్టీ జ్యూవెలర్స్.. పసిడి ప్రియులకు ఆఫర్లు..
GRT Jewellers: పసిడి ప్రియులకు ఒక గుడ్ న్యూస్. శాశ్వత సౌందర్యానికి చిహ్నంగా ఉన్న బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ జీఆర్టీ జ్యూవెలర్స్ తన ప్రియమైన కస్టమర్ల కోసం విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. 1964లో స్థాపితమైన కంపెనీ 57 ఏళ్లుగా కస్టమర్లతో తన వ్యాపార ప్రస్థానాన్నికొనసాగిస్తోంది. ఈ ప్రఖ్యాత గోల్డ్ ఆభరణాల సంస్థ తెలుగు ప్రజల ఆధరణ పొందేందుకు తన అతిపెద్ద షోరూమ్ ను ఇప్పుడు మన విజయవాడలో ఈనెల 22న ప్రారంభించింది.
సాంప్రదాయక బంగారు నగలను అందుబాటులో ఉంచటమే కాక, ఆధునిక, శ్రేష్ఠమైన, హై ఎండ్ ఆభరణాలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడలోని ఈ షోరూమ్ లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, అరుదైన రత్నాలను కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

కొత్త షోరూం ప్రారంభ ఆఫర్ గా కంపెనీ తన కస్టమర్లకు బంగారంపై గ్రాముకు రూ.50 తగ్గింపును అందిస్తోంది. పాత బంగారంపై ఎక్ఛ్సేంజ్ లో గ్రాముకు రూ.50 అదనంగా అందిస్తోంది. ఇదే సమయంలో పాలిష్డ్ డైమండ్స్ విలువపై 10 శాతం తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఇదే క్రమంలో వెండి ఆభరాణాలపై మజూరీ విషయంలో 25 శాతం, వెండి ఆభరణాల MRPపై 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఆభరణాల కొనుగోలు స్కీమ్స్ పొందే కస్టమర్లకు బహుమతులను కూడా అందిస్తోంది.

విజయవాడలో షోరూమ్ ప్రారంభంపై మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ ఆనంద్ అనంతపద్మనాభన్ సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలో ఇది అందరూ వెళ్లాలనుకునే ప్లేస్ అని అన్నారు. ఈ సందర్భంగా ఆఫర్లపై తగ్గింపులు నెలరోజులపాటు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. తమ ఖాతాదారులకు దగ్గర కావటంతో పాటు కళాత్మకమైన ప్రత్యేక డిజైన్లను అందించేందుకు శ్రద్ధతో ముందుకు సాగుతామని జీఆర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. సరికొత్త ప్రపంచాన్ని వినియోగదారులకు పరిచయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications