Rocket Stock: ఒక్క రోజే రూ.1,300 పెరిగిన స్టాక్.. ఒక్క షేరు ఉంటే రూ.40,000 లాభం..
GRP Limited: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో కార్పొరేట్ కంపెనీలు తమ మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించటం ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, డివిడెండ్ వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లో చాలా మిడ్ క్యాప్ స్టాక్‌లు ఉన్నాయి. ఇవి ఏడాదిలోనే పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను తమ పెట్టుబడిదారులకు అందించాయి. ఈ క్రమంలో జీఆర్‌పీ లిమిటెడ్ కంపెనీ షేర్లు శుక్రవారం 6 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ.13,317.50 నమోదు చేసింది. ఇది స్టాక్‌లో 52 వారాల గరిష్టం కాగా మునుపటి ముగింపు రూ.12,063.30గా ఉంది. శుక్రవారం మార్కెట్ ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా రూ.1,300 ఒక్కో షేరుకు పెరిగింది. కంపెనీ ఒక్కో షేరు ధర జూలై 10, 2023 రూ.3,400 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిగా ఉంది.

GRP లిమిటెడ్ బోర్డు సమావేశంలో కంపెనీ బోనస్ షేర్లను పంపిణీ చేయడానికి రికార్డ్ తేదీని ప్రకటించింది. జూన్ 29, 2024 శనివారం జరిగిన ఈ సమావేశంలో అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై 3 బోనస్ షేర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కంపెనీ తన వ్యాపారాన్ని 1974లో స్థాపించబడింది. ఇది టైర్ రబ్బర్ తయారీకి ప్రసిద్ధి చెందింది. కంపెనీకి దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7 తయారీ యూనిట్లు ఉండగా ప్రస్తుతం 60 దేశాల్లో 200 కంటే ఎక్కువ కస్టమర్లకు కలిగి ఉంది. ఈ కంపెనీకి 400 కంటే ఎక్కువ సరఫరాదారులు ఉన్నారు. కంపెనీ మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.138 కోట్ల త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది.
FY24 నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.12 కోట్లుగా ఉంది. కంపెనీ వార్షిక పనితీరును పరిశీలిస్తే FY23లో రూ.451 కోట్లతో పోలిస్తే రూ.461 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీలో ప్రమోటర్లు 40.36 శాతం వాటాను కలిగి ఉండగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ 59.64 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications