Stock market: జెరోధా ఆధిపత్యానికి గ్రో బ్రేక్.. ఆ విభాగంలో టాప్ పొజిషన్ కైవసం
Stock market: స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ బ్రోకర్ల ద్వారా జరుగుతుంటాయి. షేర్ ఖాన్, ఏంజల్ వన్, అప్ స్టాక్స్ వంటి సంస్థలు మార్కెట్లో ఉన్నా జెరోధా వాటిలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ విభాగంలోని మరో స్టాక్ బ్రోకర్ జెరోధాకు గట్టి షాక్ ఇచ్చింది.
యాక్టివ్ క్లయింట్‌లలో జెరోధాని వెనక్కునెట్టి గ్రో(Groww) దూసుకుపోయింది. అయితే ఆదాయంలో మాత్రం నితిన్ కామత్ కంపెనీనే ముందుండటం గమనార్హం. NSE డేటా ప్రకారం.. జెరోధాకు 64.8 లక్షలు యాక్టివ్ కస్టమర్స్ ఉండగా.. గ్రో 66.3 లక్షల క్రియాశీల క్లయింట్‌లతో భారతదేశపు అతిపెద్ద స్టాక్‌బ్రోకర్‌గా అవతరించింది.

మార్చి 2021 నాటికి జెరోధాకు 34 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు ఉండగా గ్రోకు అప్పుడు కేవలం 7.8 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ రెండేళ్లలో గ్రో విశేషమైన వృద్ధిని కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే ఓ సంవత్సరంలో కనీసం ఒక ట్రేడ్ చేసే వారిని యాక్టివ్ కస్టమర్ గా NSE లెక్కిస్తోంది.
వినియోగదారుల సంఖ్యలో గ్రో మెరుగ్గా ఉన్నప్పటికీ.. రాబడి పరంగా జెరోధా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గ్రోతో పోలిస్తే 5 రెట్లు ఆదాయాన్ని జెరోధా నివేదించింది. మార్చి 31, 2023 ఆర్థిక సంవత్సరానికి PAT 39 శాతం పెరిగి 2 వేల 907 కోట్లకు చేరింది. కాగా అంతకు ముందు ఏడాది ఇది కేవలం 2 వేల 94 కోట్లే. జెరోధా ఆదాయం, లాభాల పెరుగుదలకు F&O సెగ్మెంట్ ప్రధాన కారణమని కంపెనీ CEO కామత్ ఇటీవల స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications