Groww: స్టాక్ బ్రోకర్ 'గ్రో' గ్రోత్‌కు RBI బూస్ట్.. ఆ సేవలకు లైసెన్స్ మంజూరు
RBI News: స్టాక్ మార్కెట్లో వివిధ బ్రోకింగ్ సంస్థలు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఇన్వెస్టర్ల అభిమానాన్ని చూరగొని, భారీ స్థాయిలో మార్కెట్ షేర్ సొంతం చేసుకున్నాయి. వాటిలో అప్‌స్టాక్స్, జెరోధాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే వాటికి పోటీగా రంగంలోకి దిగిన 'గ్రో' తన సత్తా చాటుతోంది.
పేమెంట్ అగ్రిగేటర్‌గా చెల్లింపులు నిర్వహించేందుకు ఫిన్‌టెక్ యునికార్న్ 'గ్రో'ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. బ్రోకింగ్ సంస్థ గ్రో UPI పేమెంట్ ప్లాట్‌ఫారమ్ 'గ్రో పే'కి ఈ మేరకు RBI లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో టైగర్ గ్లోబల్, పీక్ XV పార్టనర్స్ మద్ధతు కలిగిన ఆ సంస్థకు UPI ద్వారా ఇ-కామర్స్ లావాదేవీలు సులభతరం చేసేందుకు అవకాశం లభిస్తోంది.

గ్రో యూపీఐ గతేడాది జూలైలో ప్రారంభించబడింది. లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌లు, విద్యుత్ మరియు నీటి బిల్లులు చెల్లించడం, DTH మరియు మొబైల్ రీఛార్జ్ వంటి బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్ అనుమతిస్తోంది. తాజాగా RBI నుంచి లైసెన్స్ కూడా రావడం సంస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
యాక్టివ్ యూజర్‌ల పరంగా గతేడాది అక్టోబర్‌లో గ్రో తన ప్రత్యర్థి జెరోధాను మొదటిసారి అధిగమించింది. 2023లో 7.5 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. కాగా జెరోధా 6.7 మరియు ఏంజెల్ వన్ 5.3 మిలియన్ MAUలతో తర్వాతి స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వాల్యుయేషన్ పరంగానూ జెరోధాతో పోటీ పడుతోంది. 3.6 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా, గ్రో 3 బిలియన్ డాలర్లతో తన హవా కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications