Groww CEO Lalit Keshre Success Story: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కుర్రాడు ఇప్పుడు బిలియనీర్. ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆ బాలుడు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిమిత వనరుల మధ్య చదువును కొనసాగించిన పిల్లాడు ఇప్పుడు దిగ్గజ కంపెనీకి సీఈఓగా మారాడు. సాధించాలనే తపన ఉండాలే కాని ఎటువంటి కష్టాలు అడ్డంకి కావని నిరూపిస్తున్నాడు.
వ్యాపార ప్రపంచాన్ని శాసించే బిలియనీర్ల విజయకథలు మనం ఎన్నో విన్నాం. కానీ ఈ రోజు చెప్పుకోబోయేది మాత్రం భిన్నమైన, హృదయాన్ని తాకే ప్రయాణం. పట్టణాల వెలుగులకు, సౌకర్యాలకు దూరంగా ఒక చిన్న గ్రామంలో పెరిగిన యువకుడు.. అనేక ఆర్థిక పరిమితులు, కష్టాలను దాటుకుని ఈ రోజు భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ఆరాధించబడిన ఫిన్‌టెక్ CEOలలో ఒకరిగా ఎదిగాడు. అతడు ఎవరో కాదు.. భారతదేశంలోని ప్రముఖ పెట్టుబడి వేదిక Groww కు సహ వ్యవస్థాపకుడు, CEO అయిన లలిత్ కేష్రే.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా... అక్కడి లెపా అనే చిన్న గ్రామం. చుట్టూ పొలాలు, పరిమిత వనరులు, రోజువారీ కష్టాలతో జీవించే కుటుంబాలు. అలాంటి వాతావరణంలో పుట్టిన ఒక రైతు కొడుకు కథే - నేడు కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన లలిత్ కేష్రే జీవన ప్రయాణమే ఈ వారం సక్సెస్ స్టోరీ.
సాధారణ వ్యవసాయ కుటుంబం: లలిత్ కేష్రే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక పరిస్థితులు సౌకర్యవంతంగా లేవు. చిన్నతనంలోనే తాతామామల ఇంట్లో పెరిగాడు. అవసరాలు ఎక్కువ, వనరులు తక్కువ. కానీ ఒక విషయం మాత్రం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అదే పెద్దగా కలలు కనాలి అనే ఆలోచన. చుట్టూ ఉన్న పరిస్థితులు చిన్నగా ఆలోచించమని చెప్పినా, అతని మనసు మాత్రం ఆకాశాన్ని తాకేలా కలలను కంటూ ఉండేది.
గేమ్-చేంజర్ ఎక్కడంటే: గ్రామంలో విద్యా సదుపాయాలు పరిమితంగా ఉన్నప్పటికీ, జిల్లాలోని ఏకైక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివే అవకాశం అతనికి దొరికింది. అదే అతని జీవితంలో ఒక గేమ్-చేంజర్ అయింది. రోజూ పొలాల్లో పని చేసే కుటుంబం నుంచి వచ్చి, ఇంగ్లీష్ చదువు, కఠినమైన సిలబస్.. ఇలా అన్నీ సవాళ్లే. అయినా లలిత్ వెనక్కి తగ్గలేదు. ప్రతి రోజు చదువు, ప్రతి రోజు కృషి... చివరకు దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా గుర్తింపు పొందిన IIT-JEE ను అతను జయించాడు. ఆ విజయం కేవలం ఒక అడ్మిషన్ కాదు. అది అతని జీవితానికి కొత్త దారిని చూపింది.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ఉద్యోగ ప్రయాణం: IIT బాంబే లో అడుగుపెట్టడం అతనికి ఒక కల నెరవేరిన క్షణం. అక్కడ అతను చదువుతో పాటు ఆలోచనలను కూడా పెంచుకున్నాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థిగా, ప్రపంచం ఎంత పెద్దదో, అవకాశాలు ఎంత విశాలమో అతనికి అర్థమయ్యాయి. చదువు పూర్తయ్యాక, లలిత్ తన కెరీర్‌ను ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభించాడు. స్టార్టప్ ప్రపంచంలో తొలినాళ్లలోనే పనిచేసే అవకాశం దొరికింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రారంభ ప్రోడక్ట్ మేనేజర్లలో అతనొకడిగా గుర్తింపు పొందాడు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి ఆలోచన: ఉద్యోగం చేస్తున్నా నేను ఇంకేదో చేయాలని అతని మనసులో ఎక్కడో ఒక అసంతృప్తి. నా లాంటి సామాన్యులకు ఉపయోగపడేదేదైనా సృష్టించాలనే ఆలోచన అతన్ని వెంటాడేది. అదే సమయంలో అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ ఎదురైన కాగితపు పని, క్లిష్టమైన ప్రక్రియలు అతన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. నేను ఒక ఇంజినీర్‌ని, చదువుకున్నవాడిని... నాకే ఇంత కష్టం అయితే, సాధారణ వ్యక్తికి ఇది ఎంత కష్టమై ఉంటుందనే ప్రశ్న అతని మనసులో బలంగా నాటుకుంది.
Groww పుట్టుక: అక్కడినుంచే ఒక ఆలోచన మొలిచింది. పెట్టుబడిని అందరికీ సులభంగా మార్చాలి. ఆ ఆలోచనే భవిష్యత్తులో Growwగా రూపాంతరం చెందింది. 2016లో ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తూనే తన ఆలోచనను హర్ష్ జైన్‌తో పంచుకున్నాడు. ఆ ఆలోచనపై నమ్మకం ఏర్పడింది. తర్వాత నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ బృందంలో చేరారు. నలుగురు కలిసి ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగారు. అదేంటంటే భారతదేశంలో పెట్టుబడిని ఎటువంటి భయాలు లేకుండా సులభంగా మార్చడం..
అలా ప్రారంభమైన Groww.. నేడు లక్షలాది మందికి మొదటి పెట్టుబడి అడుగు అయ్యింది. ముఖ్యంగా COVID-19 సమయంలో, ఇంట్లో కూర్చుని పెట్టుబడి పెట్టాలనుకున్న కొత్త తరం కోసం Groww ఒక ద్వారం లాగా మారింది. నెమ్మదిగా అది భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ వేదికగా ఎదిగింది. 2021లో యూనికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించింది. 2023 నాటికి దాని విలువ 3 బిలియన్ డాలర్లను దాటింది. కంపెనీ లిస్టింగ్ తర్వాత Groww మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లకు పైగా చేరింది.
ఈ విజయంలో కీలక పాత్రధారి అయిన లలిత్ కేష్రే Growwలో ప్రస్తుతం 9.06 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆ వాటా విలువ రూ.9,448 కోట్లకు పై మాటే. ఇది ఆయనను అధికారికంగా భారతీయ బిలియనీర్ల జాబితాలోకి చేర్చింది. అయితే ఈ సంఖ్యల వెనుక ఉన్నది కేవలం సంపద కాదు. ఒక రైతు కొడుకు కలల విజయం.
లలిత్ కేష్రే కథ క్లుప్తంగా మనకు ఏమి చెబుతుందంటే..పుట్టిన ప్రదేశం, పరిస్థితులు, వనరుల లేమి ఇవేమి నీ గమ్యాన్ని నిర్ణయించవు. సంకల్పం, కృషి, ధైర్యం ఉంటే చిన్న గ్రామం నుంచి కూడా బిలియనీర్ స్థాయికి చేరుకోవడం కూడా సాధ్యమేనని నిరూపిస్తోంది. కలలు కనండి... వాటికోసం చివరి వరకూ పోరాడండి అని యువతకు ఇతని ప్రయాణ సందేశం చెబుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications