Groww Fraud: దేశీయంగా ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కొనసాగించేందుకు తమ బ్రోకరేజ్ యాప్స్ వినియోగిస్తున్నారు. కొందరు తెలివైన కస్టమర్లు మాత్రమే నేరుగా మ్యూచువల్ ఫండ్ హౌస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా సొంతగా పెట్టుబడులను పెడుతున్నారు.
తాజాగా దేశంలో వేగంగా కస్టమర్లను సముపార్జిస్తూ దూసుకుపోతున్న గ్రో బ్రోకరేజ్ సంస్థ చేస్తున్న పెద్ద మోసాన్ని బయటపెట్టాడు హనేంద్ర ప్రతాప్ సింగ్ అనే వాల్‌మార్ట్ ఉద్యోగి. వాస్తవానికి తన సోదరి గ్రో యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టి ఎలా మోసపోయిందనే వ్యవహారాన్ని వివరిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అతను ప్రస్థావించిన అంశాలు చాలా మంది మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులతో పాటు గ్రో యాప్ యూజర్లను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అసలు జరిగిన స్కామ్ ఏంటి..?
హనేంద్ర ప్రతాప్ సింగ్ లింక్డిన్ పోస్ట్ ప్రకారం.. బాధితుడి సోదరి 2020లో గ్రోయాప్ ద్వారా పరాగ్ పరీఖ్ మ్యూచువల్ ఫండ్‌లో కొంత మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. యాప్ లో దీనికి సంబంధించి ఫోలియో నంబర్‌తో పాటు సరైన పెట్టుబడి మెుత్తం, అందులోని మెుత్తం పెరుగుదలకు సంబంధించిన వివరాలు సైతం వచ్చాయని వెల్లడించారు. అయితే ఇక్కడే అసలు స్కామ్ మెుదలైంది. వారు తమ పెట్టుబడి మెుత్తాన్ని విత్ డ్రా చేసేందుకు అభ్యర్థించగా అది పనిచేయలేదు.
దీంతో బాధితులు తమ ఫోలియో వివరాలతో నేరుగా పరాగ్ పరీఖ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించటంతో తమ వద్ద ఆ ఫోలియోతో ఎలాంటి పెట్టుబడులు లేవని పేర్కొంది. దీనిపై బ్రోకరేజ్ సంస్థ గ్రో కస్టమర్ కేర్ ను సంప్రదించగా.. వారు ర్యాష్ సమాధానం అందించారు. సమస్యను తాము పరిష్కరిస్తామని చెబుతూ మెుత్తం యాప్ లోని పోర్ట్ ఫోలియో వివరాలను మాయం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని హనేంద్ర ప్రతాప్ సింగ్ సెబీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సైతం ట్యాగ్ చేస్తూ ఈ మోసాన్ని అరికట్టాలని, తమ డబ్బు వెంటనే తమకు అందేలా చూడాలని కోరాడు.
గ్రో యాప్ స్పందన..
ఈ వ్యవహారంపై ఎట్టకేలకు గ్రో యాజమాన్యం సైతం స్పందించింది.పెట్టుబడిదారుడు క్లెయిమ్ చేసిన మొత్తం గురించి ఆందోళన చెందకుండా చూసేందుకు తాము మంచి విశ్వాసం ఆధారంగా పెట్టుబడిదారుడి ఖాతాలోనికి సొమ్మును క్రెడిట్ చేసినట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. పెట్టుబడి పెట్టినట్లు క్లెయిమ్ చేయబడిన పేర్కొన్న మొత్తం డెబిట్‌ని రుజువు చేసే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అందించమని తాము పెట్టుబడిదారుని కోరినట్లు అందులో వెల్లడించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications