ఇప్పుడు మనం చూస్తున్నా, భారతదేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నట్లు అనిపిస్తోంది, అసలు విషయం ఏంటంటే, మనం అభివృద్ధి చెందుతున్న దేశంలో జీవిస్తున్నా, ఆ అభివృద్ధి ఫలితాలు మన వరకు రావడం లేదు. ఎందుకంటే... ఆ అభివృద్ధి కేవలం కొందరికి మాత్రమే దక్కుతోంది అని ఇప్పుడు ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. "భారతదేశంలో ఆదాయ అసమానతలు ఇప్పుడు బ్రిటీష్ కాలం కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటు పేదలు మరియు ధనికుల మధ్య దూరం కూడా మరింత పెరిగిపోతుంది.

హార్దిక్ జోషి అనే ఆర్థిక విశ్లేషకుడు ఈ విషయం గురించి ఒక శక్తివంతమైన వ్యాఖ్య చేశారు: మీకు అవునా అనిపించవచ్చు, కానీ గణాంకాలు చూస్తే నిజమే. దేశంలోని 1% మంది ప్రజలు 40% దాటిన ఆస్తిని కలిగి ఉండగా, సగం ప్రజలు కేవలం 6% వాటాతో జీవిస్తున్నారు. ఈ అసమానతలు ఎందుకు పెరిగాయో, ఈ వ్యవస్థ మరింత మందిని నష్టపరిచేది ఎందుకు అవుతుందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.
పొలాల్లో పని చేసే రైతు, ఫ్యాక్టరీలో కూలీగా పని చేసే కార్మికుడు, డెలివరీ అబ్బాయి, స్కూల్ టీచర్, వీళ్ళు రోజంతా కష్టపడతారు. కానీ వారి ఆదాయం మాత్రం నిత్యం పోతున్న ధరలకు సరిపోడు. దీన్ని చూస్తే, మనం అభివృద్ధి చెందుతున్నామా? లేక కేవలం కొందరు అభివృద్ధి చెందుతుండగా మిగతావాళ్లు అక్కడే నిల్చిపోయారా అన్న సందేహం తలెత్తుతుంది.
అసమానతలు యాదృచ్ఛికంగా పుట్టలేదట నిపుణుడు చెప్పిన ప్రకారం చెబుతున్నది నిజం ఇది కొంతమందికే లాభపడే విధంగా రూపొందించిన పాలసీల ఫలితం. కార్పొరేట్ టాక్స్ తగ్గించడం, కార్మిక హక్కులను ఉల్లంఘించే సంస్కరణలు, ప్రభుత్వ ఆదాయంలో పన్నుల వాటా తక్కువవడం ఇవన్నీ దీని వెనుక ఉన్న అసలు కారణాలు. మరింత గమనించాల్సిన విషయం ఏంటంటే, అసమానతలు శక్తివంతులకే ప్రమాదం అన్న భావన వాస్తవానికి సరైనది కాదు. అసలు, ఈ అసమానతలే కొందరికి ప్రయోజనంగా మారాయి.
ఈ పరిస్థితిలో మార్పు ఎలా?
మన దేశం నిజంగా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి అనేది కేవలం టవర్ల లోని ఇంజినీర్లు, స్టార్టప్ కంపెనీల్లో డైరెక్టర్లకే కాకుండా గ్రామంలో వున్న చిన్న రైతు, కాలనీలో నివసించే మధ్యతరగతి యువతికి కూడా చేరాలి.
ఏం చేయాలి అంటే?
ధనవంతులపై సరైన పన్ను విధానం అమలవ్వాలి. చిన్న వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఆరోగ్యం, విద్య వంటి అవసర రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. కార్మిక హక్కులను రక్షించాలి. వాస్తవిక డేటాపై ఆధారపడి అభివృద్ధి లక్ష్యాలు నిర్ణయించాలి.
మనకు స్వాతంత్ర్యం వచ్చింది కానీ స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉందా? ధనం పోటులో ముందు పరిగెత్తేవారికి గోల్డ్ మెడల్ పడుతోంది కానీ మిగిలినవారు మాత్రం స్టార్ట్ లైన్ దగ్గరే నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించడం తప్పు కాదు. మనం ఎవరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామో, ఆ అభివృద్ధి ఎవరికి దక్కుతుందో ఒకసారి మనమూ ఆలోచించాలి.
ఇప్పటికి మన దేశంలో అభివృద్ధి పేరుతో పెద్దగా మాట్లాడుతున్నా, వాస్తవానికి సామాన్య ప్రజల జీవితాల్లో ఒత్తిడి మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. పేదరికం, ఆకలి, సరైన ఆరోగ్య సేవల కొరత ఇవన్నీ తీవ్రమవుతున్నాయి. దేశ GDP పెరుగుతోంది, కానీ ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా అందడం లేదు. 2014 నుంచి 2022 మధ్య అపారమైన సంపద దేశంలో కలిగినా, దాని లాభాల్లో పేదవర్గాల భాగస్వామ్యం దాదాపు కనిపించకుండా పోయింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications