Go First: నగదు కొరతతో ఇబ్బంది పడుతూ గ్రౌండ్ అయిన గోఫస్ట్ విమాన సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు కొనసాగుతున్నాయి. విమానాలను తిరిగి గాల్లోకి ఎగిరేలా చేసేందుకు అవసరమైన కీలక పరిణామం చోటుచేసుకుంది.
రూ.400 కోట్ల మధ్యంతర నిధులకు ఎయిర్‌లైన్ రుణదాతలు ఆమోదం తెలపటంతో గోఫస్ట్‌కు పెద్ద ఉపశమనం లభించింది. గత నెలలో GoFirst నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) వద్ద తన స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దాఖలు చేసింది. దీంతో తాత్కాలికంగా కంపెనీ తన విమానసేవల రద్దును తాత్కాలికంగా పొడిగించుకుంటూ వస్తోంది. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు తగిన నిధుల కోసం వెతుకుతోంది.

తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డ్యుయిష్ బ్యాంక్, IDBI బ్యాంకులతో కూడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(CoC) అదనపు నిధుల కోసం గోఫస్ట్ చేసిన అభ్యర్థనను ఆమోదించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. వ్యాపార ప్రణాళిక ఆధారంగా, కార్యకలాపాల పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి రుణదాతలు కన్సార్టియం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో త్వరలోనే సేవలు తిరిగి ప్రారంభమవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో అవసరమైన మేరకు మరిన్ని అదనపు నిధుల కోసం వారు అంగీకారం తెలవచ్చని ఒక బ్యాంకర్ వెల్లడించారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఎయిర్‌లైన్ 4 బిలియన్ల నుంచి 6 బిలియన్ల భారతీయ రూపాయల మధ్య అదనపు నిధులను అడుగుతోంది. గో ఫస్ట్ జూలైలో కార్యకలాపాలను పునఃప్రారంభించాలని, 22 విమానాలతో 78 రోజువారీ విమాన సేవలను నడపాలని యోచిస్తోందని తెలుస్తోంది. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల పునఃప్రారంభం రెగ్యులేటరీ ఆమోదాలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఎయిర్‌లైన్ ఇప్పుడు పెట్టుబడిదారుల కోసం వేట కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications