న్యూఢిల్లీ: వస్తు, సేవా పన్నుల (GST) వసూళ్లు తగ్గాయి. కిందటి నెలతో పోల్చుకుంటే 16.6 శాతం మేర క్షీణత కనిపించింది ఇందులో. ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదు కాలేదు.. రాబడి అందలేదు. ఏప్రిల్ నాటి వసూళ్లతో పోల్చుకుంటే 26 వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ తగ్గింది. ఏపీలో మాత్రం జీఎస్టీ కలెక్షన్లు భారీగా పెరిగాయి. 47 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో పోల్చుకుంటే- ఏపీలో ఈ సంఖ్య భారీగా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు అధికంగా రికార్డయ్యాయి.

ఏప్రిల్ కంటే తక్కువే..
కిందటి నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,67,540 కోట్ల రూపాయలు. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో నమోదైన జీఎస్టీ కలెక్షన్లు.. నెల తిరిగే సరికి పడిపోయాయి. మే నెలలో 1,40,885 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు రికార్డయ్యాయి. ఈ మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ (CGST) వాటా 25,036 కోట్ల రూపాయలు కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)- 32,001 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 73,345 కోట్ల రూపాయలు. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 37,469 కోట్ల రూపాయలు.

సెస్ ద్వారా..
వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 10,502 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన పన్నుల ద్వారా 931 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2021 మే నెలలో అందిన జీఎస్టీ కలెక్షన్లతో పోల్చుకుంటే- ఈ సారి 44 శాతం పెరిగింది. గత సంవత్సరం మే నెలలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని పట్టి పీడించిన విషయం తెలిసిందే.

గత ఏడాది మేలో ఇదే కాలానికి..
అప్పట్లో 97,821 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు అందాయి. ఈ మే నెలలో అలాంటి పరిస్థితులు లేకపోవడంతో కలెక్షన్లలో 44 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. 1,40,885 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే 16.6 శాతం తగ్గుదల కనిపించింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు సగానికి పెరిగాయి. గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ మేలో 47 శాతం అధికంగా ఈ రెవెన్యూ సాధించింది ఏపీ.

ఏపీలో 47 శాతం వృద్ధి..
2021 మేలో ఏపీ రికార్డు చేసిన జీఎస్టీ కలెక్షన్లు రూ.2,074 కోట్ల రూపాయలు కాగా.. ఈ ఏడాది అదే నెలలో 47 శాతం వృద్ధిరేటును అందుకుంది. 3,047 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లను సాధించింది. రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.372 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.741 కోట్లు, పంజాబ్-రూ.1,833 కోట్లు, చండీగఢ్-రూ.167 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,309 కోట్లు, హర్యానా-రూ.6,663 కోట్లు, ఢిల్లీ-4,113 కోట్లు, రాజస్థాన్-3,789 కోట్లు నమోదయ్యాయి.

ఉత్తర ప్రదేశ్‌లో..
ఉత్తర ప్రదేశ్-రూ.6,670 కోట్లు, బిహార్-రూ.1,178 కోట్లు, సిక్కిం-రూ.279 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.82 కోట్లు, నాగాలాండ్-రూ.49 కోట్లు, మణిపూర్-రూ.47 కోట్లు, మిజోరం-రూ.25 కోట్లు, త్రిపుర-రూ.65 కోట్లు, మేఘాలయ-రూ.174 కోట్లు, అస్సాం-రూ.1,062 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,896 కోట్లు, జార్కండ్-రూ.2,468 కోట్లు, ఛత్తీస్‌గఢ్-2,627 కోట్లు, మధ్యప్రదేశ్-రూ.9,321 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.300 కోట్లు రికార్డయ్యాయి.

తెలంగాణలో..
మహారాష్ట్ర-రూ.20,313 కోట్లు, కర్ణాటక-రూ.9,232 కోట్లు, గోవా-రూ.461 కోట్లు, కేరళ-రూ.2,064 కోట్లు, తమిళనాడు-రూ.7,910 కోట్లు, పుదుచ్చేరి-రూ.181 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.24 కోట్లు, తెలంగాణ-రూ.3,982 కోట్లు, లఢక్-రూ.12 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications