GST, UPI: భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. రికార్డు క్రియేట్ చేస్తున్న యూపీఐ పేమెంట్లు..!
ఆగస్టులో భారత్ స్థూల వస్తువులు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 14.8% పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరువయ్యాయి. పన్ను వాపసులలో 68 శాతం పెరుగుదల నమోదు అయింది. అధిక దిగుమతులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి నమోదైంది. మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు 2025లో రూ.1,74,116 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు, ఆగస్టు 2026లో రూ.1,99,853 కోట్లకు చేరాయి. ఇది భారతదేశ ఆర్థిక దృఢత్వానికి నిదర్శనంగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో రూ.31,795 కోట్ల వాపసుల తర్వాత నికర వసూళ్లు రూ.1,68,057 కోట్లుగా ఉన్నాయి.
ఇది గత ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.1,55,181 కోట్లతో పోలిస్తే 8.3 శాతం వృద్ధిని సూచిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఆగస్టు 2025లో రీఫండ్స్ రూ.18,935 కోట్లుగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్‌లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ తర్వాత నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల స్థాయి వద్ద స్థిరపడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రక్రియల సరళీకరణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించాలి. జీఎస్టీ కౌన్సిల్ తన 56వ సమావేశంలో సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చేలా 5 శాతం, 18 శాతంతో కూడిన సరళీకృత రెండు-స్లాబ్ల GST విధానాన్ని, అలాగే విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై 40శాతం ప్రత్యేక స్లాబును ప్రకటించింది.

ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం నిబంధనల అమలును సులభతరం చేసే అనేక ప్రతిపాదనలను పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఏడాది విరామం తర్వాత జరుగుతున్న ఈ 57వ GST కౌన్సిల్ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావంపై కూడా సమీక్ష జరుపుతారని తెలుస్తోంది. పరోక్ష పన్నులకు సంబంధించిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత సమాఖ్య సంస్థ GST కౌన్సిల్. కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఒక సందర్భంలో తప్ప దీని నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉంటాయి.
జీఎస్టీ వసూల్లతో పాటు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు కూడా పెరిగాయి. ఆగస్టు నెలలో రూ.29.8 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. గతేడాది ఆగస్టులో ఈ మొత్తం రూ.24.85 లక్షల కోట్లుగా యూపీఐ పేమెంట్స్ విలువ ఇప్పుడు 20 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది మే, జులై నెలల్లో రూ.29.9 లక్షల కోట్లు చొప్పున రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆగస్టులోనూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే జులైలో 23.66 బిలియన్ లావాదేవీలు జరగ్గ్గా.. ఆగస్టులో ఆ సంఖ్య పెరిగి 24.51 బిలియన్లకు పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications