Multibagger Stock: స్మాల్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లను తమ రాబడులతో ఆశ్చర్య పరుస్తూనే ఉంటాయి. దీర్ఘకాలంలో ఊహించని విధంగా మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి. అలా మ్యాజిక్ చేసిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మిల్లింగ్ వ్యాపారంలో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ GRM ఓవర్సీస్ గురించే. ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో 10 ఏళ్ల కిందట పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో కొనసాగిస్తే 10433% రాబడులను అందించింది. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.10,000 పెట్టుబడిగా పెడితే దాని విలువ ఇప్పుడు రూ.10 లక్షలుగా ఉంది. అలాగే 20 ఏళ్ల కిందట ఎనరైనా ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు రూ.17.19 కోట్లుగా ఉంది.

అలాగే మూడేళ్ల కాలంలో స్టాక్ ఇన్వెస్టర్లకు 2467% రాబడిని అందించింది. అలాగే మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఈ కంపెనీ షేర్లు 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 102% రాబడిని అందించాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.1,032 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్రాండెడ్, నాన్-బ్రాండెడ్ బాస్మతి బియ్యం మిల్లింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యాపారంలో ఉంది. దీనికి తోడు బాదంపప్పు, లవంగాలు, పిస్తా, గోధుమ వంటి ఇతర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తుంది.
దేశీయ మార్కెట్లతో పాటు విదేశాలకు సైతం కంపెనీ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు అత్యధికంగా 71.72 శాతం వాటాలను కలిగి ఉన్నారు. FY23లో రూ.1,379 కోట్ల అమ్మకాలను కంపెనీ నమోదు చేసింది. అలాగే పన్నుల తర్వాత నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రాబడి రూ.438 కోట్లుగా ఉంది. ఈ కాలంలో నికర లాభఁ రూ.11.3 కోట్లుగా నమోదైంది.
శుక్రవారం మార్కెట్లో స్టాక్ ధర రూ.172.70 వద్ద ప్రయాణాన్ని ముగించింది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్ ధర దాదాపు 50 శాతానికి పైగా క్షీణించింది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.164.75 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.498 వద్ద ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications