Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. గ్రీన్ ఎస్ఎం క్యాబ్ కి.మీ. కు రూ.9 లే ఛార్జీ..!

క్యాబ్ ఛార్జీతో అల్లాడిపోతున్న హైదరాబాదీలకు శుభవార్త వచ్చింది. వియత్నాం దేశానికి చెందిన గ్రీన్ ఎస్ఎం ఎలక్ట్రిక్ క్యాబ్స్ త్వరలో హైదరాబాద్ ప్రారంభం కానుంది. ఈ క్యాబ్ ప్రయాణిస్తే కిలో మీటర్ కు కేవలం రూ.9 లే వసూలు చేస్తారు. మీరు 10 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే కేవలం రూ.90 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆటో కన్న తక్కువ ఛార్జీ. ఇప్పటికే ఈ సంస్థ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సేవలు అందిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో కార్యకాలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది. కాగా.. వియత్నాం ఆటోమొబైల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ మాతృ సంస్థ అయిన విన్‌గ్రూప్ యాజమాన్యంలోని వియత్నాం మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ గ్రీన్ ఎస్ఎమ్, భారతదేశంలో కొన్ని నెలల క్రితం తన పూర్తి ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ 'గ్రీన్ ఎస్ఎమ్ లిమో'ను ప్రారంభించింది.

ఈ సర్వీస్ ప్రారంభంతో,భారత మార్కెట్లోకి ఈ సంస్థ తొలిసారిగా ప్రవేశించింది. వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత, గ్రీన్ ఎస్ఎమ్‌కు భారతదేశం ఐదవ అంతర్జాతీయ మార్కెట్‌గా మారడం గమనార్హం. జూన్ లో ఢిల్లీలో ఈ క్యాబ్ సర్వీస్లు మొదటగా స్టార్ట్ చేశారు. భారతదేశంలో పూర్తి ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ రావడం ఇది మొదటిసారి కాదు. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన రైడ్-హెయిలింగ్ స్టార్టప్ బ్లూస్మార్ట్, జనవరి 2019లో ప్రారంభమై, మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పనిచేసి, ఆ తర్వాత బెంగళూరు, ముంబైలకు విస్తరించింది. అయితే ఆర్థిక అస్థిరత, నాయకత్వ నిష్క్రమణలు, నియంత్రణ విచారణల కారణంగా బ్లూస్మార్ట్ 2025 ఏప్రిల్ మధ్యలో తన కార్యకలాపాలను నిలిపివేసింది.

Cab

గ్రీన్ ఎస్ఎమ్ లిమో ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో తన సేవలు ప్రారంభించనుంది. ఈ కంపెనీ ప్రీమియం ప్రయాణీకుల రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఏడు సీట్ల పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్‌ ఉపయోగిస్తోంది. ఈ వాహనం విశాలమైన క్యాబిన్, సున్నా కార్బన్ ఉద్గారాలు,సున్నితమైన ప్రయాణం దీనిని రోజువారీ ప్రయాణాలు, విమానాశ్రయ బదిలీలు, కుటుంబ ప్రయాణాలు, వ్యాపార పర్యటనలకు ఒకే విధంగా అనుకూలంగా చేస్తాయని గ్రీన్ ఎస్ఎమ్ పేర్కొంది. గ్రీన్ ఎస్ఎం ఎలక్ట్రిక్ క్యాబ్స్ ర్యాపిడో, ఓలా, ఉబెర్ గట్టి పోటీ ఉంటుంది. కాగా ఈ సంస్థ హైదరాబాద్ లో కార్లు నడిపేందుకు డ్రైవర్లను కూడా రిక్రూట్ చేసుకోనుంది.

12 గంటు పని చేస్తే నెలకు రూ.35 వేల జీతం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వియత్నామీస్ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ ప్రతి వాహనంలో త్రాగునీరు, వెట్ టిష్యూలు, అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఈ వాహనాలలో సెక్యూర్-టు-సేఫ్ భద్రతా వ్యవస్థను పొందుపరుస్తారు. ఇందులో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ కెమెరాలు, ఏఐ-ఆధారిత పర్యవేక్షణ సాంకేతికత, డ్రైవర్లు, ప్రయాణీకుల కోసం అత్యవసర సహాయ బటన్లు ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+