గత నెలలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయడంతో.. నగరం పరిధి ఏకంగా 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ ఒక్క నిర్ణయంతో, ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాల కంటే కూడా మున్సిపల్ పరిధి పరంగా భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా గ్రేటర్ హైదరాబాద్ అవతరించింది. అయితే ఇది నిజంగా మేలు చేస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

పెరిగే సమస్యలు ఇవే..
సాధారణంగా నగరం ఎంత పెద్దదైతే దాని ఆర్థిక సామర్థ్యం (GDP) అంత పెరుగుతుందని, అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు ఆకర్షించవచ్చని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు అలా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
GHMC ఇప్పటికే రూ. 6,000 కోట్లకు పైగా అప్పులతో సతమతమవుతోంది. ఉద్యోగుల కొరత, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్ల నిర్వహణ వంటి ప్రాథమిక సేవల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా విలీనమైన 27 ప్రాంతాలకు మెరుగైన సేవలు అందించడం సవాలుగా మారే అవకాశం ఉంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) మాత్రమే కాదు, భారతదేశం అంతటా మున్సిపల్ కార్పొరేషన్లు తాము పాలించగలిగే సామర్థ్యం కంటే వేగంగా తమ సరిహద్దులను విస్తరించుకుంటున్నాయి. దీని వెనుక ఆర్థిక-రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ.. నిపుణులు ఈ విస్తరణపై హెచ్చరిస్తున్నారు. "ప్రభుత్వాలు నగరాలను ఆర్థిక వృద్ధి యంత్రాలుగా చూస్తున్నాయి. అభివృద్ధి చేసే బదులు, సరిహద్దులను విస్తరిస్తే చుట్టుపక్కల ప్రాంతాలు దానంతట అవే పట్టణీకరణ చెందుతాయని భావించడం తప్పు. " అని ఇన్ఫ్రావిజన్ ఫౌండేషన్ CEO జగన్ షా వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విస్తరణ vs సామర్థ్యం
1950ల నాటి "గ్రేటర్ బాంబే" ఆలోచన నుంచి మొదలై.. 2007లో ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వరకు.. "గ్రేటర్" నగరాల భావన దేశమంతటా విస్తరించింది. అయితే సరిహద్దుల విస్తరించినంత వేగంగా సేవలను అందించలేకపోతున్నారు.
- సేవలు లేవు: హైదరాబాద్‌లో ఇప్పటికే మాదాపూర్, నార్సింగి వంటి కొత్త ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
- పన్నుల భారం: విలీనమైన తర్వాత పౌరులు అధిక ఆస్తి పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కానీ ప్రాథమిక సేవలకు (ఉదాహరణకు, నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడటం) మాత్రం సమస్యలు తప్పడం లేదు.
- ఆర్థిక సమస్యలు: GHMC బడ్జెట్ (2025-26కి రూ. 8,440 కోట్లు) ఉన్నప్పటికీ, రూ. 6,000 కోట్లకు పైగా అప్పులు ఉండటం సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. ఇది సేవలకు కేటాయించాల్సిన నిధులను తగ్గిస్తుంది.
సిటీ ప్లానింగ్ నిపుణుల ప్రకారం.. ఒక నగరం పెద్దదిగా మారడం గొప్ప విషయం కాదు, మెరుగైన సేవలు అందించగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే ముఖ్యం. బలమైన సంస్థాగత సామర్థ్యం, మెరుగైన సిబ్బంది, ఆర్థిక స్థితిస్థాపకత లేకుండా పెద్ద నగరాలు కేవలం జనాభాను మాత్రమే సృష్టిస్తాయి.
పరిష్కారం ఎందులో ఉంది?
గ్రేటర్ హైదరాబాద్ లాంటి మెగా సిటీలు అభివృద్ధి చెందాలంటే.. పరిపాలనలో నిర్మాణాత్మక సంస్కరణలు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
- సామర్థ్యమే కీలకం: నగరాల విజయానికి దాని పరిమాణం కంటే.. పరిపాలన నాణ్యత ముఖ్యం. న్యూయార్క్, లండన్, టోక్యో వంటి గ్లోబల్ నగరాలు తమ సరిహద్దులను అంతులేకుండా పెంచడం ద్వారా విజయం సాధించలేదు. స్థిరమైన ప్రణాళిక, బలమైన సంస్థాగత వ్యవస్థల ద్వారా సాధించాయి.
- ప్రాంతీయ సమన్వయం: మెగా విలీనాలకు బదులుగా, మెట్రోపాలిటన్ కోఆర్డినేషన్ (అధికార పరిధి) ఉండాలి. ఒక పెద్ద సంస్థ కన్నా, స్థానిక అవసరాలు తీర్చడానికి చిన్న, సాధికారత కలిగిన స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి.
- ప్రణాళిక-ఆధారిత వృద్ధి: భారతీయ పట్టణాభివృద్ధి ఇప్పటికీ రియల్ ఎస్టేట్ ఆధారితంగా ఉందే తప్ప ప్రణాళిక ఆధారితంగా లేదు. మార్కెట్ శక్తులు ప్రజల అవసరాల కంటే వేగంగా పెరుగుతున్నప్పుడు, పౌరుల కోసం కాకుండా లాభాల కోసం నగరాలు రూపుదిద్దుకుంటాయి. పటిష్టమైన ప్రణాళిక, నియంత్రణల ద్వారా మార్కెట్‌ను నడిపించాల్సిన అవసరం ఉంది.
ఇలా చేస్తే మేలు
మొత్తంగా నిపుణులు చెప్పేదేంటంటే.. విస్తరణను ఆపాల్సిన అవసరం లేదు. అయితే విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సంస్థాగత సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. మొత్తం నగరానికి మౌలిక వసతులు కల్పించగలగాలి. అప్పులను తగ్గించుకుని, పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుని, ప్రతి పౌరుడికి సేవలను సమానంగా అందించగలిగినప్పుడే విస్తరణ నిజమైన అభివృద్ధిగా మారుతుంది. టోక్యో, లండన్ వంటి అంతర్జాతీయ నగరాలు తమ సరిహద్దులను విస్తరించడం ద్వారా కాకుండా స్థిరమైన ప్రణాళికల ద్వారా అలాగే ప్రాంతీయ సేవల కోసం మెట్రోపాలిటన్ సమన్వయాన్ని ఏర్పరచడం ద్వారా విజయం సాధించాయి.
హైదరాబాద్ వంటి నగరాలు కూడా కేవలం మ్యాప్‌లో పెద్దగా కనిపించడం కోసం కాకుండా.. ప్రతి ప్రాంతానికి నీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి సేవలు సక్రమంగా అందించగలిగేలా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. విలీనం చేయడం ద్వారా స్థానిక స్వయంప్రతిపత్తిని తగ్గుతుంది. దానికి బదులు.. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలు (MPC) ఏర్పాటు చేసి.. వాటిద్వారా సమన్వయం చేసుకునేలా స్వతంత్ర స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడమే గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తుకు సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications