Penny Stocks: లక్ష పెట్టుబడిని రూ.22 లక్షలుగా మార్చిన పెన్నీ స్టాక్.. ఆ ప్రముఖ ఇన్వెస్టర్ కొత్తగా షేర్లు కొన్న

Multibagger Stocks: మంచి పెన్నీస్టాక్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటే.. సెలబ్రిటీ ఇన్వెస్టర్లు సైతం వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో సెలబ్రిటీ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఈ కంపెనీలో 3 లక్షలకు పైగా షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ స్టాక్ ప్రస్తుతం ఐదు శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. మంచి ఫండమెంటల్స్ ఉన్న ఈ మల్టీబ్యాగర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పైపైకి ప్రయాణిస్తున్న స్టాక్..

పైపైకి ప్రయాణిస్తున్న స్టాక్..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న స్టాక్ గ్రావిటా ఇండియా గురించే. ఇది గడచిన రెండు సంవత్సరాల్లో తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటన్స్స్ అందించింది. ఇది రూ.11.80 నుంచి ప్రస్తుతం ఈ రోజు(14-07-2022) అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.261.25 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే రెండేళ్ల కాలంలో స్టాక్ దాదాపు 450 శాతానకి పైగా రాబడిని అందించింది. మార్కెట్లు ఎక్కువ ఒలటాలిటీలో ఉన్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం పైకి వెళుతూనే ఉంది. ఏడాది కాలంలో గమనిస్తే షేర్ 50 శాతానికి పైగా పెరిగింది. ఈ స్టాక్ లో రెండు సంవత్సరాల కిందట లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.22.13 లక్షలు ఆదాయం వచ్చి ఉండేది.

బిగ్ వేల్ పెట్టుబడులు..

బిగ్ వేల్ పెట్టుబడులు..

భారతీయ స్టాక్ మార్కెట్‌లో 'బిగ్ వేల్'గా పిలవబడే కచోలియా ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీలో ఈ కంపెనీ షేర్లలో తన వాటాను 0.46% నుంచి 1.81%కి పెంచుకున్నారు. అతను గ్రావిటా ఇండియాలో మెుత్తం 12,49,608 షేర్లను కలిగి ఉన్నారు. ఈయన పోర్ట్‌ఫోలియోలో.. ఆతిథ్యం, ​​విద్య, ఇన్‌ఫ్రా, తయారీ రంగాలకు చెందిన స్టాక్‌లలో రూ.1,543.6 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్నారు.

విదేశాలల్లో కంపెనీ వ్యాపార వివరాలు..

విదేశాలల్లో కంపెనీ వ్యాపార వివరాలు..

1992లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్థాపించబడింది. ఇది దేశంలో లెడ్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ.. అంతర్జాతీయ వాణిజ్యం, టర్న్‌కీ సొల్యూషన్స్‌లో నాన్‌ఫెర్రస్ మెటల్స్, ప్లాస్టిక్స్ పరిశ్రమ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వ్యాపారాలను కలిగి ఉంది. కంపెనీ భారతదేశంతో పాటు USA, సింగపూర్, నెదర్లాండ్, శ్రీలంక, ఘనా, మొజాంబిక్, సెనెగల్, టాంజానియా, జమైకా, మాలి, మౌరిటానియా , నికరాగ్వాలో కార్యాలయాలతో పాటు ప్లాంట్లను కలిగి ఉంది.

కంపెనీ లాభాలు ఇలా..

కంపెనీ లాభాలు ఇలా..

2022 మార్చి క్వార్టర్ లో కంపెనీ సేల్స్ టర్నోవర్ రూ.560.95 కోట్లుగా ఉంది. ఈ సమయంలో ఇతర ఆదాయాలతో కలుపుకుని మెుత్తం సేల్స్ రూ.562.83 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో పన్నుల తరువాత లాభం రూ.12.31 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.160.20 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.398.00గా ఉంది. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ ఇన్వెస్టర్ తన పెట్టుబడులను పెంచుకోవటం చూస్తుంటే.. రానున్న కాలంలో ఈ స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

NOTE: పైన వెల్లడించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేముందు తప్పకుండా మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+