Grasberg Gold Mine in Papua: ప్రపంచంలోనే అతి పెద్ద, విలువైన ఖనిజ బంగారు గని గురించి మీకెవరికైనా తెలుసా.. ఎక్కడో మూల పర్వత ప్రాంతాలలో ఈ బంగారు గని ఉంది. ఇంతకీ అది ఎక్కడ ఉందో తెలుసా.. ఇండోనేషియాలోని సుదైమాన్ పర్వత శ్రేణిలో ఈ బంగారు గని దాగుంది. ఇండోనేషియాలోని పాపువా ప్రదేశంలో.. ప్రపంచానికి దూరంగా కనిపించే పర్వత శ్రేణుల్లో గ్రాస్‌బర్గ్ గని దాగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా పేరు పొందిన ఈ ప్రాజెక్టు వెనుక సైంటిఫిక్, బిజినెస్, స్ట్రాటజిక్ డెప్త్ కూడా ఉంది.సముద్ర మట్టానికి 4,100 మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ గని భౌగోళికంగా అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.ఇది కేవలం బంగారంతో కాకుండా, భారీ స్థాయిలో రాగి ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది.
1960లలో అమెరికాకు చెందిన ఫ్రీపోర్ట్-మెక్‌మోరాన్ సంస్థ గ్రాస్‌బర్గ్ గనిని అభివృద్ధి చేసే హక్కులు పొందింది. ఇండోనేషియా ప్రభుత్వం సాయంతో ఈ కంపెనీ ఈ గనిని నిర్వహిస్తోంది.మొదట ఓపెన్-పిట్ మైనింగ్ ద్వారా ప్రారంభమైన గ్రాస్‌బర్గ్ బంగారు గని ఇప్పుడు అత్యాధునిక అండర్‌గ్రౌండ్ మైనింగ్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తోంది. ప్రధానంగా మూడు మైనింగ్ జోన్లు ఇందులో ఉన్నాయి. గ్రాస్‌బర్గ్ బ్లాక్ కేవ్, డీప్ మిల్ లెవల్ జోన్, బిగ్ గోసాన్ ఈ మూడు ఈ బంగారు గనిలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలుస్తున్నాయి.

(Photo-Credit-www.123rf.com)
ప్రతి ఏడాది గ్రాస్‌బర్గ్ గనిలో నుండి సగటున 48 టన్నుల బంగారం, 1.8 బిలియన్ పౌండ్ల రాగిని వెలికి తీస్తున్నారు. ఈ గని ఒకప్పట్లో ఓపెన్-పిట్ మైనింగ్ ద్వారా నడిపించబడింది. కానీ ఇప్పుడు భూమిపై ఖనిజాలు తగ్గిపోవడంతో భూగర్భ మైనింగ్ (Underground Mining) పద్ధతిలోకి మారిపోయింది అక్కడ. ఆధునిక సాంకేతికతలైన రిమోట్ మానిటరింగ్, ఆటోమేటెడ్ యంత్రాలు, బ్లాక్ కేవింగ్ పద్ధతులు ఉపయోగించి బంగారాన్ని వెలికి తీస్తున్నారు.
2023లో గ్రాస్‌బర్గ్ గని నుంచి 52 టన్నులు (1.7 మిలియన్ ఔన్సులు) బంగారాన్ని వెలికి తీసారు. ఇక 680,000 టన్నులు రాగిని బయటకు తీసారు. దీంతో పాటుగా 190 టన్నులు వెండిని కూడా ఉత్పత్తి చేశారు. ఈ గణాంకాలు గ్రాస్‌బర్గ్ గనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి. గ్రాస్‌బర్గ్ గని కేవలం ఖనిజ వనరులతోనే నిండిపోలేదు. గ్రాస్‌బర్గ్ ప్రాంతాన్ని ఒక చిన్న పట్టణంగా అభివృద్ధి చేశారు. అక్కడ 20 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. కార్మికుల కోసం గృహ సముదాయాలు, స్కూల్లు, హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ప్రత్యేక విమానాశ్రయం, ఓడరేవు కూడా ఉంది. 103 మైళ్ల పైప్‌లైన్ ద్వారా ఖనిజ రవాణా జరుగుతుంది.
ఈ బంగారు గని ఓపెన్-పిట్, అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధానాల కలయికతో ఏర్పడిన అరుదైన గనిగా చరిత్రలో నిలిచింది. గనిలోని ఓపెన్-పిట్ విభాగం వ్యాసం 4 కిలోమీటర్లు, లోతు 1.2 కిలోమీటర్లు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అంతటి పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ కొనసాగడంలో పర్యావరణ సమస్యలు కూడా తప్పడం లేదు. నదుల్లోకి వ్యర్థాల విడుదల, పర్యావరణ ప్రభావాలతో ఈ గని విమర్శలకు గురవుతోంది.ఇక పాపువాలో వేర్పాటువాద ఉద్యమాల నేపథ్యంలో రాజకీయ సమస్యలు కూడా ఈ గనిని వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించడం, పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం వంటి అంశాలు ఈ గనికి సవాల్ గా మారాయి.స్థానిక పాపువాన్ తెగల జీవనోపాధిపై ప్రభావం, పర్యావరణ నాశనం వంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి.
గ్రాస్‌బర్గ్ గని విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ గని ద్వారా ఇండోనేషియా జీడీపీలో దీని ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది.ప్రపంచ ఖనిజ రంగంలో ఇది ఒక శక్తివంతమైన కేంద్రంగా మారుతోంది. ఈ గని దేశానికి భారీగా ఆదాయాన్ని అందించడమే కాక, వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.ఈ ఒకే ఒక్క గనితో దేశ ఆర్థిక ప్రగతికి ఎంతటి మార్పు చేర్పులు చేయవచ్చో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ గనిని ఇండోనేషియా సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ బంగారం ఉత్పత్తిదారుల్లో నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications