IPO News: తొలిరోజే షాకిచ్చిన ఐపీవో.. పెట్టుబడిదారులకు పెద్ద నష్టం.. మీరూ కొన్నారా..?
Graphisads IPO: ఎన్నో ఆశలతో చాలా మంది ఐపీవోలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లిస్టింగ్ ద్వారా వచ్చే లాభాలను ఆనందించాలని భావిస్తున్న చాలా మందికి నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గ్రాఫిసాడ్స్ ఐపీవో లిస్టింగ్ గురించే. నేడు దీని స్టాక్స్ NSE SME కేటగిరీలో లిస్ట్ అయ్యాయి. అయితే ఎన్నో ఆశలతో ఉన్న షేర్లు అలాట్ అయిన పెట్టుబడిదారులకు ఫ్లాట్ లిస్టింగ్ నిజంగా షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఒక్కో షేరు రూ.111.50 రేటు వద్ద జాబితా చేయబడింది. ఇది వాస్తవంగా ఇష్యూ ధర రూ.111 కంటే కేవలం 0.5 శాతం మాత్రమే ఎక్కువ. అయితే కొద్దిసేపటికే స్టాక్ 5 శాతం మేర నష్టపోయింది. మధ్యాహ్నం 12.13 గంటల సమయంలో షేర్ ధర రూ.105.95 వద్ద 4.55 శాతం నష్టంలో కొనసాగుతోంది.

గ్రాఫిసేడ్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం నవంబర్ 30న ప్రారంభించబడి డిసెంబర్ 5న ముగిసింది. ఐపీవో దరఖాస్తుకు చివరి రోజున ఇది 3.86 సార్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ క్రమంలో కంపెనీ 45,69,600 షేర్లను అమ్మకానికి పెట్టగా.. 1,76,18,400 ఈక్విటీ షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. అలాగే రిటైల్ కేటగిరీ 5.52 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 2.01 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ తాజా ఇష్యూ ద్వారా రూ.53.41 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. ఐపీవో ఇష్యూ సమయంలో గరిష్ఠంగా షేర్ విక్రయ ధరను రూ.111గా నిర్ణయించింది. IPO లాట్ పరిమాణం 1,200 షేర్లుగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం రూ.1,33,200 పెట్టుబడిగా పెట్టారు. మెుత్తానికి ఐపీవో తన ఇన్వెస్టర్లను తొలిరోజే నిరాశకు గురిచేసింది.


Click it and Unblock the Notifications