Stock Market 2025: వాస్తవానికి 2024లో రిటైల్ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలో కొత్త శక్తిగా అవతరించారు. భారతీయ ఈక్విటీల దీర్ఘకాలిక పథం చెక్కుచెదరకుండా ఉందని మోజో పీఎంఎస్, సీఐవో సునీల్ దమానియా గుడ్ రిటర్న్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు 2025లో మాత్రమే కాకుండా రానున్న దశాబ్దంలో ప్రపంచ మార్కెట్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆశావాదాన్ని వెల్లడించారు.
అయితే రానున్న ఏడాదిలో మార్కెట్లలో ర్యాలీ గుడ్డిగా నడవదని స్టాక్స్ పనితీరు ఆధారంగా ఇది నడపబడుతుందని ఆయన వెల్లడించారు. కొన్ని రంగాలు మాత్రమే మార్కెట్లను ముందుకు నడపటంలో దోహదపడతాయని పేర్కొన్నారు. అయితే చాలా కాలంగా ఎదురుచుస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపు 2025లో ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఉంటుందని పేర్కొన్నారు. అయితే రానున్న ఏడాదిలో మెుత్తంగా రిజర్వు బ్యాంక్ గవర్నర్ ద్రవ్యపరపతి సమావేశాల్లో 75 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మెుదటి ఎంపీసీ సమావేశం కూడా ఉండటంతో చాలా మంది ఆశలు బడ్జెట్ సమావేశాలపై కొనసాగుతోంది.

అలాగే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో డాలర్ బలపడుతుందని ఇది భారతీయ రూపాయి విలువను 2-2.5 శాతం మధ్యలో పతనానికి దారితీసే అవకాశం కొత్త సంవత్సరంలో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2025లో స్టాక్ మార్కెట్ల ప్రతి పతన కొత్త కొనుగోలుకు అవకాశంగా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా 2024లో రిటైల్ ఇన్వెస్టర్లు తమ జ్ఞానాన్ని పెట్టుబడుల్లో ఉపయోగిస్తున్నారని చెప్పారు. చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు భారీ స్థాయిలో డబ్బును ఈక్విటీల్లోకి పంప్ చేశారని అన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెంచటం, ఎస్ఐపీ పెట్టుబడులు నిరంతరాయంగా పెరగటం మార్కెట్లలో పెరుగుదలను సూచిస్తోందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కొన్ని రోజులుగా పడిపోతున్న మార్కెట్లపై మాట్లాడుతూ ఊహించిన స్థాయిలో త్రైమాసిక ఫలితాలు లేకపోవటం ఆర్థిక వ్యవస్థ మందగించటం ప్రధాన కారణాలుగా ఉన్నయన్నారు. రేట్ల తగ్గింపుకు వచ్చే ఏడాది ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రూపాయి కొత్త కనిష్ట స్థాయిలను తాకినప్పటికీ, దాని తరుగుదల ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల కంటే ఎక్కువగా నియంత్రించబడింది. ఇది అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఆర్‌బీఐ జోక్యంతో అస్థిరత అదుపులోకి వస్తుందని వెల్లడించారు.
2024లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇప్పటి వరకు 6,346.59 పాయింట్లు వృద్ధిని నమోదు చేసింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 2,035.50 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సెప్టెంబర్ 2024 చివరిలో తమ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 85,978.25, 26,277.35ని తాకిన తర్వాత భారీ కరెక్షన్‌ను చూశాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications