Income Tax Rates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని రోజుల్లో ఆర్థిక మంత్రిగా వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త టాక్స్ విధానం కింద పెద్ద ప్రకటన రావొచ్చనే అంచనాలు అంతటా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో బడ్జెట్ పై GoodReturns.in దీనిపై నిర్వహించిన పోల్ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, 15-20 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను శ్లాబ్ ప్రవేశపెట్టడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం క్యాపెక్స్ పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని వేగవంతం చేయవచ్చనే ఆశలు ఉన్నాయి.

ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ వినియోగం పెంచటానికి మద్దతు ఇవ్వడం, ఉద్యోగ సృష్టికి మద్దతుగా తయారీ పోటీతత్వాన్ని పెంచడం, దేశంలోని ప్రజల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, వ్యవసాయ పరిశోధన-అభివృద్ధికి అధిక కేటాయింపుల వంటివి ఉంటాయని కేర్ ఎడ్జ్ రేటింగ్ ప్రతినిధి సచిన్ గుప్తా వెల్లడించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ రైతుల సంక్షేమంతో పాటు విద్యుత్, రవాణా వంటి రంగాల్లో ఇండియాలో మౌలిక వసతుల అంతరాన్ని తగ్గించే ప్రయత్నం ఉంటుందని వెల్లడించారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణపై బడ్జెట్ దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
ఇదే క్రమంలో కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి శ్రీపాల్ షా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచటానికి పన్ను రేట్లను తగ్గించాలని అన్నారు. రాబోయే బడ్జెట్ రిటైల్ పెట్టుబడిదారులకు ముఖ్యంగా తక్కువ ఆదాయ స్లాబ్‌ల్లో పన్ను ఉపశమనంపై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో దాదాపు 54 మంది మార్కెట్ ప్రతినిధుల నుంచి గుడ్ రిటర్న్స్ ఈ నెల 25-27 వరకు అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి ఈసారి మధ్య ఆదాయం నుంచి అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలపై దృష్టి పెడుతుందని అన్నారు. ఈ క్రమంలో దాదాపు 30 మంది కొత్త పన్ను విధానం కింద టాక్స్ తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కొత్త పన్ను విధానంలోని శ్లాబ్ రేట్లు..
- 0 నుంచి రూ.3 లక్షల వరకు- 0 శాతం టాక్స్
- రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు- 5 శాతం టాక్స్
- రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు- 10 శాతం టాక్స్
- రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు- 15 శాతం టాక్స్
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు- 20 శాతం టాక్స్
- రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను ఉంది
వాస్తవానికి పాత పన్ను విధానం కింద కొనసాగటం వల్ల ప్రజలకు అనేక మినహాయింపులు ఉండటం వల్ల చాలా మంది ఇప్పటికీ దానినే ఫాలో అవుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ప్రజలను మెల్లగా కొత్త పన్ను విధానానికి షిఫ్ట్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే న్యూ టాక్స్ రీజిమ్ డిఫాల్ట్ గా మార్చేసింది. అందుకే గత ఏడాది ఆర్థిక మంత్రి బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం కింద పన్ను మినహాయింపును రూ.7 లక్షల వరకు పెంచింది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంచింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications