Adani Stocks: అమెరికా సంస్థ సంచలన నివేదికతో ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ కంపెనీలకు వీలైనంత దూరంగా జరగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ GQG పార్టనర్స్ మాత్రం అదానీ స్టాక్స్ లో కోట్లు కుమ్మరిస్తున్నారు. అసలు ఏం చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు..? అసలు అదానీ కంపెనీల్లో ఏం జరుగుతోంది..?

వేల కోట్లు పెట్టుబడి..
GQG పార్టనర్స్ గతవారం అదానీ గ్రూప్ కంపెనీల్లో ఏకంగా రూ.15,446 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఈ మెుత్తాన్ని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్‌తో సహా ఇతర అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో రాజీవ్ జైన్ ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లను సైతం కొనుగోలు చేశారు.

ఇన్వెస్టర్లలో విశ్వాసం..
హిండెన్ బెర్గ్ ఆరోపణల తర్వాత తాజాగా GQG పెట్టుబడి నిర్ణయం దేశీయ ఇన్వెస్టర్లలో చాలా విశ్వాసాన్ని సృష్టించింది. ఈ క్రమంలో గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రీసెర్చ్ సంస్థ నివేదిక తర్వాత దాదాపు నెల రోజుల కంటే ఎక్కువ కాలం స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అయితే.. నిర్మాణాత్మక కోణంలో ప్రమోటర్ కుటుంబం నుంచి కొనుగోలు చేయడం మంచిదని తాము భావించినట్లు జైన్ స్పష్టం చేశారు.

ITC గతంలో..
గతంలో 1996లో పన్ను సమస్యల కారణంగా ITC ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ జైన్ కూడా 20 ఏళ్లుగా వాటాలు కలిగి ఉన్నారని చెప్పారు. కాబట్టి సంక్షోభం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇది సాధారణంగా అనేక అవకాశాలను సృష్టిస్తుంది. ఇదే సమయంలో కొన్ని సమస్యలు తప్పవని ఆయన అన్నారు. అలాగే 2019లో ఇన్ఫోసిస్‌లో విజిల్‌బ్లోయర్ ఇష్యూ వచ్చింది. ఆ సమయంలో స్టాక్ 30-45% క్షీణతను నమోదు చేసింది. అలాగే 2004 ఎన్నికల తర్వాత మెుత్తం మార్కెట్ దాదాపు 25 శాతం క్షీణతను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications