Adani Ports: పెట్టుబడి సంస్థ GQG పార్టనర్స్‌కు రోజురోజూ అదానీ గ్రూప్ కంపెనీలపై ప్రేమ పెరిగిపోతోంది. ఈ క్రమంలో తన పెట్టుబడులను సైతం క్రమంగా పెంచుకుంటూ పోతోంది. మెున్న అదానీ పవర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టగా తాజాగా అదానీ పోర్ట్స్‌ను టార్గెట్ చేసింది.
తాజా చర్య డెల్లాయిట్ అదానీ పోర్ట్స్ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరుగుతోంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌లో అదనపు షేర్లను కొనుగోలు చేయడం ద్వారా GQG పార్టనర్స్ తన వాటాను గతంలో ఉన్న 4.93 శాతం నుంచి 5.03 శాతానికి పెంచుకున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

తాజాగా అదానీ పోర్ట్స్‌లో 2.2 మిలియన్ షేర్లను కొనుగోలు చేయటం ద్వారా అదనంగా 0.10 శాతం అదనపు వాటాలను GQG దక్కించుకుంది. గత వారం బల్క్ డీల్ ద్వారా అదానీ పవర్ కంపెనీలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా 8.1 శాతం యాజమాన్యాన్ని ప్రైవేటు పెట్టుబడి సంస్థ దక్కించుకున్నట్లు సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో గతవారం జేఎస్డబ్ల్యూ పవర్ కంపెనీలో సైతం వాటాలను కొనుగోలు చేసింది.
మెుత్తానికి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారీ క్షీణతతో షేర్ విలువను అదానీ గ్రూప్ కంపెనీలు కోల్పోయిన సంగతి తెలసిందే. అప్పటి నుంచి GQG వరుసగా పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంది. ఇది దానిని లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు అదానీ కంపెనీలపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications