Adani Shares: గడచిన వారంలో స్టాక్ మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల ర్యాలీ కూడా భారీగానే కొనసాగింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే లాభాలను ఆర్జించారు.
అయితే కేవలం 5 రోజుల కాలంలో అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగటం ఇద్దరిని మాత్రం కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అవును అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్‌నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్‌నర్స్ అదానీ గ్రూప్‌లోని 6 కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు.

జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదేవిధంగా అదానీ గ్రూప్‌లోని 7 షేర్లలో ఎల్‌ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభ సమయం మార్చిలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేపట్టింది.
ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ విషయానికి వస్తే ACC మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలను కలిగి ఉంది. గత వారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానికి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులోనూ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications