IPO News: ఐపీవో సూపర్ లిస్టింగ్.. అడుగుపెట్టగానే 300% లాభం.. అప్పర్ సర్క్యూట్..
GPES Solar Listing: ఎన్నికల తర్వాత జూన్ నెల చివరి వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన ఐపీవో ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది. మార్కెట్లోకి అడుగుపెట్టగానే మెుదటి రోజు పెట్టుబడిదారులను కంపెనీ షేర్లు ధనవంతులుగా మార్చేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జీపీ ఎకో సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. సోలార్ ప్యానెల్స్ తయారీలో ఉన్న కంపెనీ ఐపీవో నేడు మార్కెట్లో బంపర్ లిస్టింగ్ నమోదు చేసి అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. కంపెనీ 298 శాతం ప్రీమియం ధరకు NSE SMEలో రూ.375 వద్ద జాబితా చేయబడింది. వాస్తవానికి ఇష్యూ సమయంలో కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.90 నుంచి రూ.94గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీవో దరఖాస్తు చేసుకున్నప్పుడు షేర్లను పొందిన ఇన్వెస్టర్లు ఊహించని రాబడులను నేడు అందుకున్నారు.

అద్భుతమైన లిస్టింగ్ తర్వాత సోలార్ కంపెనీ షేర్లు మార్కెట్లో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్ల ధర రూ.393.75 స్థాయికి చేరుకుంది. ఐపీవో లిస్టింగ్ తర్వాత ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్ల సొమ్ము కేవలం నిమిషాల్లోనే 4 రెట్లు పెరిగింది. వాస్తవానికి ఐపీవో జూన్ 14న ప్రారంభించబడి జూన్ 19న ముగిసింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికింద పెట్టుబడి పెట్టాలంటే ఎవరైనా ఇన్వెస్టర్ కనీసం రూ.1,12,800 పెట్టుబడిగా పెట్టారు. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.30.79 కోట్లను విజయవంతంగా సమీకరించగా ఇందుకోసం 32.76 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
కంపెనీ జూన్ 13న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8.30 కోట్లను సమీకరించింది. ఐపీవో ఇష్యూ ఇన్వెస్టర్ల కోసం తెరచిఉన్న మూడురోజుల్లో 1187.72 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. చివరి రోజున 856.21 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. రిటైల్ విభాగంలోని ఐపీవో చివరి రోజున 793 సార్లు సభ్యత్వం పొందగా.. మొదటి రోజు 61.92 సార్లు, రెండవ రోజు 269.59 సార్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కంపెనీ ప్రమోటర్లు దీపక్ పాండే, అంజు పాండే, ఆస్తిక్ మణి త్రిపాఠిలకు ఐపీవోకి ముందర కంపెనీలో 86.40 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications