IPO News: సూపర్ సోలార్ కంపెనీ ఐపీవో.. జూన్ 14న ప్రారంభం.. డబ్బులు రెడీ చేసుకోండి..

GP ECO Solutions IPO: మోదీ సర్కార్ దేశంలో సోలార్ విద్యుత్, గృహాలకు సోలార్ విద్యుత్ అందించటంపై దృష్టి సారించటంతో ఈ రంగంలోని కంపెనీలపై ప్రజల దృష్టి పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న సోలార్ కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు.

మార్కెట్లోకి మరో కంపెనీ ఐపీవో ఈ వారంలో పెట్టుబడుల కోసం తెరుచుకుంటోంది. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది సోలార్ కంపెనీ GP ఎకో సొల్యూషన్స్ ఇండియా గురించే. జూన్ 14 నుంచి జూన్ 19 వరకు ఈ ఇష్యూలో పెట్టుబడిదారులు డబ్బును పెట్టుబడి పెట్టేందుకు తెరుచుకోనుంది. ఈ ఇష్యూ జూన్ 13న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతుంది. తాజా ఐపీవోలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.90 నుంచి రూ.94గా నిర్ణయించింది. ఒక్కో షేరు ఫేస్ వ్యాల్యూ రూ.10గా కంపెనీ నిర్ణయించింది.

GP Eco Solutions India IPO to open for investors on june 14th for betting Know details

నోయిడాకు చెందిన ఈ కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.30.79 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిదారుల కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 1,200 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించింది. కార్పొరేట్ క్యాపిటల్ వెంచర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉంది. కార్పొరేట్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవలి నెలల్లో క్రియేటివ్ గ్రాఫిక్స్, ట్రస్ట్ ఫిన్‌టెక్, ఆల్పెక్స్ సోలార్, అస్కోనెట్ టెక్నాలజీస్, రాకింగ్‌డీల్స్, ఎక్స్‌సెంట్ మైక్రోసెల్, ఒరియానా పవర్, ద్రోణాచార్య మరియు క్రేయాన్ అడ్వర్టైజింగ్‌లతో సహా విజయవంతమైన SME IPOలను పూర్తి చేసింది. నోయిడాకు చెందిన సోలార్ కంపెనీ ఐపీవోలో 32,76,000 తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.

3.27 లక్షల ఈక్విటీ షేర్లను మార్కెట్ మేకర్స్ కోసం రిజర్వ్ చేశారు. 8.83 లక్షల ఈక్విటీ షేర్లు యాంకర్ ఇన్వెస్టర్ల కోసం, 4.44 లక్షల ఈక్విటీ షేర్లు NII కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే QIB కోసం 5.89 లక్షల ఈక్విటీ షేర్లు, రిటైల్ భాగంలో 10.32 లక్షల ఈక్విటీ షేర్లు రిజర్వ్ చేయబడ్డాయి. దీపక్ పాండే కంపెనీకి ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీపక్ హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్‌ల పంపిణీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న GP ఎకో అనుబంధ సంస్థ అయిన ఇన్‌వర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+