IPO News: ఇన్వెస్టర్లు ఎగబడి కొంటున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో రాకెట్ దూకుడు ప్రీమియం..
IPO News: వచ్చేవారం మార్కెట్లోకి రానున్న ఐపీవోల విషయంలో చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతవారం వచ్చిన ఐపీవోల్లో ఒకటోరెండో మినహా అన్ని ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఐపీవో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గోయల్ సాల్ట్ ఐపీవో గురించే. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ ఐపీవోపై తమ మనసు పారేసుకోవటంతో అద్భుతమైన స్పందన కనిపించింది. ఐపీవో కోసం కంపెనీ 49.02 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.18.63 కోట్లను సమీకరిస్తోంది. దీంతో అక్టోబర్ 10న జరగనున్న స్టాక్ లిస్టింగ్ పైనే అందరి చూపు ఉంది. ఈ క్రమంలో గ్రేమార్కెట్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ IPO రిటైల్ పెట్టుబడిదారుల కోసం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు తెరవబడింది. ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచి ఉన్న 5 రోజుల కాలంలో అధిక దరఖాస్తులు రావటంతో 432 సార్లు ఐపీవో ఓవర్ సబ్‌స్క్రయిబ్ చేయబడింది. కేవలం ఐపీవో చివరి రోజున చివరి రోజున 294 సార్లు సబ్‌స్క్రైబ్ కావటంతో సంచలనంగా మారింది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.36 నుంచి రూ.38గా నిర్ణయించింది. బ్రోకరేజ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.25 ప్రీమియం ధరను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రానున్న రోజుల్లో స్టాక్ లిస్టింగ్ రూ.63 స్థాయిలో ఉండొచ్చని తెలుస్తోంది. దీని ప్రకారం పెట్టుబడిదారులు మెుదటి రోజే మంచి లాభాలను ఆర్జించనున్నట్లు తెలుస్తోంది.
ఐపీవో లాట్ పరిమాణాన్ని 3000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీనికోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.1,14,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టింగ్ కానున్నాయి. ఇక వ్యాపారం విషయానికి వస్తే.. 2010లో స్థాపించబడిన గోయల్ సాల్ట్ లిమిటెడ్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉప్పు నీటి నుంచి ముడి లవణాలను పారిశ్రామిక లవణాలు, తినదగిన లవణాలుగా ఉపయోగించడం కోసం శుద్ధి చేసే వ్యాపారంలో ఉంది. అలాగే తినటానికి వినియోగించే ఫ్రీ ఫ్లో సాల్ట్ ఉప్పును సైతం తయారు చేస్తోంది. కంపెనీ పరిశ్రమలకు సైతం ఇండస్ట్రియల్ సాల్ట్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తోంది.


Click it and Unblock the Notifications