IPO Multibagger: మనలో చాలా మంది మల్టీబ్యాగర్ రాబడుల గురించి వినే ఉంటాం. అయితే తాజాగా ఐపీవోలు వీటిని తలదన్నే పనితీరుతో ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తున్నాయి.
అవును స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి పట్టుమని పదిరోజు అవుతున్న గోయల్ సాల్ట్ ఐపీవో ప్రస్తుతం మరోసారి తన పనితీరుతో వార్తల్లో నిలిచింది. మార్కెట్లో మెుదటిరోజే పేలుడు లిస్టింగ్ చేసిన గోయల్ సాల్ట్ స్టాక్ పండుగ సీజన్లో ఇన్వెస్టర్ల సంపదను మూడింతలకు పైగా పెంచి సంతోషాలను నింపింది. ఇష్యూ సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.38 రేటుకు విక్రయించగా.. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో షేర్ ధర రూ.175.95 వద్ద కొనసాగుతోంది.

కంపెనీ షేర్లు ప్రస్తుతం ఐపీవో ఇష్యూ ధర కంటే 363 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 26న ఐపీవో ప్రారంభమై అక్టోబర్ 3న ముగిసింది. ఈ IPO ప్రారంభమైన 5 రోజుల్లో 511 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. పెట్టుబడిదారుల నుంచి బలమైన సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత కంపెనీ మంచి లిస్టింగ్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే 10 రోజుల్లోనే పెట్టుబడిదారులు కంపెనీ షేర్ల నుంచి మల్టీబ్యాగర్ రాబడులను అందుకున్నారు. ఒక లాటులో 3000 షేర్లను రూ.1,14,000 పెట్టి కొన్ని ఇన్వెస్టర్ల సొమ్ము ప్రస్తుతం రూ.5.27 లక్షలకు చేరుకుంది. శుక్రవారం కూడా కంపెనీ షేర్లలో 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి.
వ్యాపారం విషయానికి వస్తే.. 2010లో స్థాపించబడిన గోయల్ సాల్ట్ లిమిటెడ్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉప్పు నీటి నుంచి ముడి లవణాలను పారిశ్రామిక లవణాలు, తినదగిన లవణాలుగా ఉపయోగించడం కోసం శుద్ధి చేసే వ్యాపారంలో ఉంది. అలాగే తినటానికి వినియోగించే ఫ్రీ ఫ్లో సాల్ట్ ఉప్పును సైతం తయారు చేస్తోంది. కంపెనీ పరిశ్రమలకు సైతం ఇండస్ట్రియల్ సాల్ట్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తోంది.


Click it and Unblock the Notifications