Dividend+Bonus Stock: దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ క్యూ1 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో అనేక లిస్టెడ్ కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, డివిడెండ్ ప్రకటిస్తూ వారిని సంతోషంలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న స్మాల్ క్యాప్ కంపెనీ మాత్రం రెండింటినీ ఒకేసారి అందిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గోయెల్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ హోటల్ అండ్ రిసార్ట్స్ వ్యాపారంలో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. రానున్న వారంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్‌తో పాటు బోనస్ ఇష్యూ కోసం ఎక్స్-డేట్‌లో ట్రేడ్ కానున్నాయి. తొలిసారిగా గోయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ తన పెట్టుబడిదారులకు డబుల్ రివార్డ్‌ను ప్రకటించింది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో బీఎస్ఈలో షేర్ల ధర రూ.171.45 వద్ద ముగిశాయి.

మార్చి 31, 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లకు ఒక్కో షేరుపై 50 పైసల డివిడెండ్‌ను అందించాలని బోర్డు నిర్ణయించింది. గోయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మేలో ఈ ప్రకటన చేసింది. ఇదే సమయంలో 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును కలిగి ఉన్నందుకు 4 ఉచిత షేర్లను కంపెనీ రానున్న కాలంలో అందించనుంది. బోర్డు ఆమోదం పొందిన తేదీ నుంచి రెండు నెలల్లో బోనస్ షేర్లు జమ అవుతాయని కంపెనీ వెల్లడించింది. వీటికోసం రికార్డు తేదీని జూలై 31గా నిర్ణయించబడింది. గడచిన రెండేళ్లలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 115.93 శాతం రాబడిని అందించాయి.
1996లో స్థాపించబడిన BIKA గ్రూప్ (గతంలో గోయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్) పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ బాంకెట్ చెయిన్‌లలో ఒకటి. కోల్‌కతా, హౌరాలో తమకు 8 విలాసవంతమైన విందు వేదికలు కలిగి ఉంది.


Click it and Unblock the Notifications