adani: భారీ ఇల్లు, ప్రైవేటు జెట్లు, లగ్జరీ కార్లు.. అదానీ విలాసాలకు కొదువే లేదు
adani: ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న పేరు గౌతమ్ అదానీ. రూ.25 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో తులతూగుతున్న ఆయన వ్యాపార సామ్రాజ్యం నేలమట్టమవుతోంది. హిండెన్ బర్గ్ విడుదల చేసిన ఒక్క నివేదికతో పరిస్థితి మొత్తం తారు మారైంది. దిగ్గజ వ్యాపారిగా ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడవ స్థానం నుంచి ఏకంగా 30కి పడిపోయారు. ఈ నష్టాలు ఇక్కడితో ఆగే పరిస్థితి సైతం కనిపించడం లేదు, మరింతగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటి ? జీవన విధానం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
నాలుగు వందల కోట్ల ఇల్లు:
గౌతమ్ అదానీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. మొదట ఆయనకున్న వాహనం స్కూటర్ కాగా ఇప్పుడు భారీ ఓడలు, ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన అనేక కార్లు ఉన్నాయి. ఇవిగాక 2020లో రూ.400 కోట్లు వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆదిత్య ఎస్టేట్ కు సంబంధించిన 3.4 ఎకరాల ఆస్తిని కైవసం చేసుకున్నారు.

విలాసవంతమైన కార్లు, ప్రైవేట్ జెట్లు:
బొంబార్డియర్, బీచ్‌క్రాఫ్ట్ మరియు హాకర్ కు చెందిన మూడు ప్రైవేట్ జెట్లు అదానీ వద్ద ఉన్నాయి. వాటిలో వరుసగా 8, 37, 50 మంది ఒకేసారి ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. మిరుమిట్లు గొలిపే ఎరుపు రంగు ఫెరారీ ఆయన గ్యారేజీలో ఉంది. ఇదిగాక విలాసవంతమైన BMW 7 కారు ఆయన సొంతం. తన ప్రయాణ అవసరాల కోసం మూడు హెలీకాఫ్టర్లను సైతం కొనుగోలు చేశారు. 2011లో అగస్టావెస్ట్ ల్యాండ్ కు చెందిన రెండు ఇంజన్లు గల AW139 హెలీకాఫ్టర్ కొన్నారు. 15 సీట్లు గల దాని ఖరీదు రూ.12 కోట్లు.


Click it and Unblock the Notifications