For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020-21లో ఎల్ఐసీ IPO, కానీ ఆస్తులు లెక్కకట్టడం అంత ఈజీకాదు

|

202-21 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను పబ్లిక్ ఇష్యూకు తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎల్ఐసీని నమోదు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం తమ ముందు ఉన్న అతి పెద్ద పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటి అని ఓ అధికారి వెల్లడించినట్లుగా ఓ వార్తాపత్రిక వెల్లడించింది.

ఏపీలో MDM స్కీం కోసం అదనంగా రూ.200 కోట్లు, ప్రతిరోజూ గుడ్డుఏపీలో MDM స్కీం కోసం అదనంగా రూ.200 కోట్లు, ప్రతిరోజూ గుడ్డు

అయితే ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) సులువైనది కాదని, స్థిరాస్తి, ఈక్విటీలు సహా పలు విభాగాల్లో ఈ సంస్థకు ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నందున సంస్థ వ్యాల్యూను లెక్కగట్టేందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ సంస్థాగత ఇన్వెస్టర్‌గా ఉన్న ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల వ్యాల్యూ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రూ.31 లక్షల కోట్లుగా ఉంది.

Govt source says mulling initial public offering in LIC in FY21

2018-19 ఆర్థిక సంవత్సరంలో మిగులు 9.9 శాతం పెరిగి రూ.532.14 బిలియన్‌లుగా ఉంది. ఎల్ఐసీ రూ.500 బిలియన్లు దాటడం అదే మొదటిసారి. ఈ కంపెనీ ప్రభుత్వానికి రూ.26.11 బిలియన్ల డివిడెండ్ ఇచ్చింది. ఇన్సురెన్స్ రంగంలో ఎల్ఐసీ మార్కెట్ వాటా 70 శాతానికి పైగా ఉంది. ఏడాది క్రితం కంపెనీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.831 కోట్ల నుంచి రూ.1.20 ట్రిలియన్లకు పెరిగింది.

పెన్షన్, గ్రూప్ బీమా పథకాల విభాగం నుంచి 2019-20లో ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల కొత్త ప్రీమియాన్ని వసూలు చేసినట్లు ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ విభాగం నుంచి ఇంత పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలు చేయడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ నిధి నిర్వహించడంలో ఎల్ఐసీకి దాదాపు 80 శాతం మార్కెట్ ఉంది.

English summary

2020-21లో ఎల్ఐసీ IPO, కానీ ఆస్తులు లెక్కకట్టడం అంత ఈజీకాదు | Govt source says mulling initial public offering in LIC in FY21

In what could be the country's biggest initial public offering in recent times, the government is mulling to list Life Insurance Corp of India in the next financial year starting April, a senior official in the Department of Investment and Public Asset Management said.
Story first published: Wednesday, January 8, 2020, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X