చిన్న కంపెనీలకు భారీ ఊరట... ప్రభుత్వ కొత్త నిర్ణయం

దేశంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు, స్టార్టుప్ లకు భారీ ఊరట. ఈ కంపెనీలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకోబోతోంది. చిన్న కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే పెనాల్టీలు, రుసుములను భారీగా తగ్గించాలన్నదే ఆ నిర్ణయం. ప్రస్తుతం అన్ని కంపెనీలకు ఒకేలా వర్తిస్తున్న జరిమానాలు, రుసుములు ఇక ముందు ఎంఎస్ఎంఈ లకు వేరేలా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇవి అమల్లోకి వస్తే తప్పకుండ చిన్న తరహా కంపెనీలకు మేలు జరగనుంది. బడా కంపెనీలకు ప్రస్తుతం విధిస్తున్న జరిమానాల్లో సగం మాత్రమే స్టార్టుప్ కంపెనీలు, చిన్న కంపెనీలకు విధించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో వెల్లడించింది. అయితే, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందో ఇంకా స్పష్టత లభించలేదు.

చట్టంలో మార్పులు...

చట్టంలో మార్పులు...

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీ ని నియమించింది. కంపెనీ లా కమిటీ అని పేర్కొంటున్న ఈ కమిటీ రెండు మూడు రోజుల్లోనే తమ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని తెలిసింది. కోటక్ మహీంద్రా బ్యాంకు అధిపతి ఉదయ్ కోటక్, ప్రముఖ న్యాయవాది శార్దూల్ ష్రాఫ్ సహా 11 మంది సభ్యులున్న ఈ కమిటీ మొత్తంగా 60 సూచనలు చేయనుంది. ఇందులో సుమారు 45 వరకు క్రిమినల్ కేసులు నమోదు చేసే అంశాలను కూడా రద్దు చేయనున్నట్లు తెలిసింది. అలాగే చిన్న, స్టార్టుప్ కంపెనీలకు ఊరటనిచ్చే అనేక సూచనలు ఈ కమిటీ రూపిందించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పెనాల్టీలు సగానికిపైగా తగ్గించాలన్న సూచనలున్నాయి. ఈ కమిటీ నివేదికను అమలు చేస్తే కంపెనీల చట్టంలో తగు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది.

సంస్కరణలు...

సంస్కరణలు...

కొంత కాలంగా కంపెనీలపై చాలా కఠినంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం... ప్రస్తుతం అనేక సంస్కరణలు అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల జరిగిన నష్టానికి తోడు ఇటీవలి ఆర్థిక మాంద్యం కూడా ప్రభుత్వానికి అతి పెద్ద పరీక్ష పెడుతోంది. అమ్మకాలు తగ్గి పోయి, ఉద్యోగాలు ఊగుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతూ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. దేశంలో తయారీ రంగానికి ఊతం ఇవ్వటం తో పాటు అనేక సరళీకరణ చర్యలతో మాత్రమే ఎకానమీ గాడిలో పెట్టగలమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముందుగా చిన్న కంపెనీలకు ఊరట నిచ్ఛే అనేక చర్యలు చేపడుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు కూడా ఇలాంటి నిర్ణయాలు కీలకమే.

చిన్నవే ... కానీ

చిన్నవే ... కానీ

స్టార్టప్ కంపెనీలు, చిన్న మధ్య తరహా కంపెనీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లు సైజులో చిన్నవే కానీ ... దేశ ఆర్థిక వ్యవస్థలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 70% చిన్న మధ్యతరహా కంపెనీలే కల్పిస్తున్నాయి. మన ఎగుమతుల్లో సుమారు సగం వాటా ఈ కంపెనీలదే. అందుకే చిన్న కంపెనీలను కాపాడుకోవటం ప్రభుత్వానికి ఎంతైనా అవసరం. ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలంటే మరిన్ని చిన్న తరహా కంపెనీలు దేశంలో నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

పెద్ద కష్టం..

పెద్ద కష్టం..

చిన్న కంపెనీలను నెలకొల్పే వ్యవస్థాపకులు వాటిని విజయవంతంగా నడిపేందుకు చాలా కష్టపడతారు. అయినా.. కనీసం రెండు మూడేళ్ళ వరకు లాభాల మాటే ఉండదు. ఇలాంటి కష్టకాలంలో కొన్ని రకాల ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా అమలు చేయలేక పోతారు. అందుకు ప్రభుత్వము భారీ పెనాల్టీ లు విధిస్తూ ఉంటుంది. ఇటీవల జీఎస్టీ తో చిన్న కంపెనీలకు ఈ తలనొప్పి మరింత అధికం ఐంది. జీఎస్టీ రిజిస్టర్ చేసుకోక పోతే పెద్ద కంపెనీల నుంచి వర్క్ ఆర్డర్లు రావటం లేదు. ఒక వేళ రిజిస్టర్ చేసుకొని బిజినెస్ చేయక పోయినా జీఎస్టీ ఫైల్ చేయాల్సిందే అంటారు. అది ఫైల్ చేయక పోతే రోజుకు సుమారు రూ 50 ఫైన్ విధిస్తున్నారు. అటు బిజినెస్ సరిగ్గా లేక, ఇటు పెనాల్టీలు కట్టలేక ... వ్యాపారాలు మానేసి వెళ్లేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారందరికీ పెనాల్టీలు భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకోబోయే కొత్త నిర్ణయం తప్పకుండ మేలు చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+