డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పుడు కొత్త చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా UPI పేమెంట్స్ పెంచడానికి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ పరిశీలిస్తున్నారు. ఈ ప్లాన్ అమలు అయితే క్రెడిట్ కార్డ్స్ కంటే UPI ద్వారా చేసే పేమెంట్స్ చౌకగా ఇంకా మరింత ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా మారుతుంది. ఇంకా కస్టమర్లకు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు.

మింట్ రిపోర్ట్ ప్రకారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ స్కిం పై త్వరలోనే ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. UPI ద్వారా పేమెంట్స్ చేసే వారికీ కొంత డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఇలాంటి డిస్కౌంట్ లభించదు. అంటే మీరు షాపుల నుండి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు UPI ఉపయోగించి పేమెంట్ చేస్తే మీరు అదే వస్తువులను కొంచెం తక్కువ ధరకు పొందవచ్చు.
ఈ స్కిం ఎలా ప్రయోజకరంగా ఉంటుంది అంటే : ఇప్పటివరకు ఒక కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ చేసినప్పుడల్లా కిరాణా షాపుకి 2% నుండి 3% MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చెల్లించాల్సి ఉంటుంది, ఇది ఒక రకమైన పన్ను. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు రూ.100 విలువైన వస్తువులను కొనుగోలు చేసి కార్డు ద్వారా పేమెంట్ చేస్తారని అనుకుందాం, అప్పుడు కిరాణా షాపుకి దాదాపు రూ.2-3 నష్టం వాటిల్లుతుంది. సింపుల్'గా చెప్పాలంటే స్వైపింగ్ చార్జెస్ విధిస్తారు. ఈ చార్జెస్ ప్రతి రూ.100కి కొత్త శాతం ప్రకారం ఉంటుంది.
కానీ UPI పేమెంట్స్ పై MDR ఉండదు. దీని అర్థం దుకాణదారుడికి పూర్తిగా రూ.100 పొందుతాడు. ఇప్పుడు ప్రభుత్వం కస్టమర్ కూడా ఈ ప్రయోజనాన్ని నేరుగా పొందాలని కోరుకుంటోంది. అంటే ఇప్పుడు మీరు100 రూపాయల విలువైన వస్తువును కొనుగోలు చేసేటప్పుడు UPI ద్వారా డబ్బు చెల్లింపులు చేస్తే మీరు దానిని కేవలం 98 లేదా 99 రూపాయలకు పొందవచ్చు.
కస్టమర్లకు ప్రత్యక్ష బెనిఫిట్ లభిస్తుంది: ప్రభుత్వం ఈ ప్లాన్ అమలు చేస్తే ప్రతి కొనుగోలుపై కస్టమర్‌కు స్పెషల్ సేవింగ్ లభిస్తుంది. దీనికోసం ప్రభుత్వం ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు అలాగే NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో చర్చలు జరుపుతోంది. ఈ ప్లాన్ పై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు, కానీ ప్లాన్ అమలు చేస్తే షాపింగ్ విధానం భారీగా మారవచ్చు. ఇంకా సామాన్యులకు ఎంతో మేలు అవుతుంది.


Click it and Unblock the Notifications