కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్‌కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోవడానికి నిరాకరిస్తే.. సదరు గృహాలకు సరఫరా అవుతున్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
'నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్, 2026 పేరుతో విడుదల చేసిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు ఈ మార్పును ఖచ్చితంగా పాటించాలి. ఒకసారి సంబంధిత అధికారుల నుండి నోటీసు అందిన తర్వాత.. మూడు నెలల గడువులోపు పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోని పక్షంలో, ఆ చిరునామాకు సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారు.

ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన అస్థిరత, సరఫరా గొలుసులో తలెత్తుతున్న ఆటంకాలు కారణమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో (మధ్యప్రాచ్యం) జరుగుతున్న యుద్ధం కారణంగా ఎల్‌పీజీ దిగుమతులు క్లిష్టంగా మారాయి. ఎల్‌పీజీ ఎక్కువగా విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉంటుంది.
అదే పీఎన్‌జీ స్వదేశీ వనరుల నుండి, వైవిధ్యభరితమైన మార్గాల ద్వారా లభిస్తుంది. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం వల్ల సిలిండర్ల బుకింగ్, రవాణా, డెలివరీ వంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా, ఇంధన భద్రత కూడా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో పీఎన్‌జీ వాడకాన్ని పెంచడం ద్వారా మిగిలే ఎల్‌పీజీ నిల్వలను పైప్‌లైన్ సౌకర్యం లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు మళ్లించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
కొత్త నిబంధనల అమలులో కొన్ని మినహాయింపులు, బాధ్యతలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా గృహానికి పీఎన్‌జీ కనెక్షన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని అధికారులు గుర్తిస్తే, వారు 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) పొందిన తర్వాత ఎల్‌పీజీని యథావిధిగా వాడుకోవచ్చు.
అయితే, అపార్ట్‌మెంట్లు లేదా హౌసింగ్ సొసైటీలు పైప్‌లైన్ వేయడానికి అనుమతులు నిరాకరిస్తే, మూడు నెలల గడువు తర్వాత ఆ కాంప్లెక్స్‌లోని అన్ని గృహాలకు సిలిండర్ల సరఫరా ఆగిపోతుంది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు పీఎన్‌జీ కనెక్టివిటీని అందించాలని గ్యాస్ సరఫరా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను 'అత్యవసర వస్తువుల చట్టం' కింద జారీ చేయడం వల్ల వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను వేగవంతం చేయడానికి, అడ్డంకులను తొలగించడానికి అధికారులకు ప్రత్యేక అధికారాలను కల్పించారు.
పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడం, సామాన్యుడికి నిరంతరాయంగా గ్యాస్ అందేలా చూడటమే ఈ చర్యల అంతిమ లక్ష్యం. భవిష్యత్తులో తలెత్తే అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి పీఎన్‌జీకి మారడం అనేది ఒక అనివార్యమైన, ప్రయోజనకరమైన అడుగు అని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications