Oil prices: వంట నూనె ప్యాకెట్లపై కొత్త రూల్.. ఇకపై రేట్లను ఈజీగా పోల్చి చూసుకోవచ్చు!

మనం కిరాణా షాపుకో లేదా సూపర్ మార్కెట్‌కో వెళ్ళినప్పుడు వంట నూనె ప్యాకెట్లను చూసి ఒక్కోసారి బుర్ర తిరిగిపోతుంది. ఒక బ్రాండ్ వాడు లీటర్ ప్యాకెట్ అంటాడు, ఇంకో బ్రాండ్ వాడు 910 గ్రాములు అంటాడు. రేట్లు చూస్తేనేమో దేనికదే విభిన్నంగా ఉంటాయి. ఏది చౌకగా వస్తుందో, ఏది కాస్ట్లీనో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.

దీనివల్ల మార్కెట్లో పెరుగుతున్న వంట నూనె ధరలు (oil prices) లెక్కలు తేల్చడం వినియోగదారులకు కష్టంగా మారింది. అందుకే ఈ కన్ఫ్యూజన్‌కు చెక్ పెడుతూ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Department of Consumer Affairs) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని కంపెనీలు కొన్ని నిర్దేశిత సైజుల్లో మాత్రమే నూనెను ప్యాక్ చేయాలని కేంద్రం ఆర్డర్ జారీ చేసింది.

Govt Mandates Standard Packaging Sizes For Edible Oils To Ease Consumer Comparison Oil Prices

ఆ 9 సైజులు మాత్రమే పర్మిషన్!

లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం.. మార్కెట్లో లభించే పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవనూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెతో పాటు బ్లెండెడ్ ఆయిల్స్‌కు కూడా ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కేవలం 9 రకాల స్టాండర్డ్ సైజులను మాత్రమే ఫిక్స్ చేసింది. అవి..

  • 200 ml/గ్రాములు
  • 500 ml/గ్రాములు
  • 1 లీటర్/కేజీ
  • 2 లీటర్లు/కేజీ
  • 3 లీటర్లు/కేజీ
  • 4 లీటర్లు/కేజీ
  • 5 లీటర్లు/కేజీ
  • 15 లీటర్లు/కేజీ
  • 20 లీటర్లు/కేజీ

ఈ సైజుల్లో కాకుండా మధ్యలో 850 ml అనో, 900 ml అనో వింత వింత సైజుల్లో ప్యాకెట్లు పెడితే కుదరదు.

బరువు, పరిమాణం రెండూ ఉండాల్సిందే!

చాలా కంపెనీలు స్మార్ట్ గేమ్‌ ఆడుతూ ప్యాకెట్‌పై కేవలం 'మిల్లీ లీటర్లు' (volume) మాత్రమే వేస్తాయి. కానీ నూనె అనేది నీళ్లకంటే సాంద్రత తక్కువ కాబట్టి లీటర్ నూనె బరువు సుమారు 910 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ లొసుగును అడ్డుకోవడానికి కేంద్రం మరో రూల్ పెట్టింది. ఒకవేళ ప్యాకెట్‌పై వాల్యూమ్ (లీటర్/ml) ఇస్తే, దానితో పాటు ఖచ్చితంగా దానికి సమానమైన బరువు (weight) ఎంతో కూడా స్పష్టంగా ముద్రించాలి.

చిన్న ప్యాకెట్లకు మినహాయింపు!

పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒక చిన్న మినహాయింపు ఇచ్చింది. 200 ml లేదా 200 గ్రాముల కంటే తక్కువ ఉండే చిన్న చిన్న ప్యాకెట్లు (శాషేలు), అలాగే పెద్దగా వాడకంలో లేని కొన్ని రకాల మైనర్ ఆయిల్స్‌కు ఈ స్టాండర్డ్ సైజ్ రూల్స్ వర్తించవు. దీనివల్ల తక్కువ బడ్జెట్‌లో నూనె కొనుక్కునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

3 నెలల టైమ్.. కంపెనీలు ఏమంటున్నాయ్?

ఈ కొత్త రూల్స్ పాటించడానికి తయారీదారులు, ప్యాకర్లు, ఇంపోర్టర్లకు ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది. అయితే ఏ కంపెనీ అయినా ఇప్పుడే ఈ రూల్స్ పాటించాలనుకుంటే వెల్‌కమ్ అని చెప్పింది.

ఇకపై మార్కెట్లో వంటనూనె ధరలు (oil prices) ఒక బ్రాండ్ నుంచి ఇంకో బ్రాండ్‌కు పోల్చి చూసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఏ కంపెనీ ఎంతకు అమ్ముతుందో తెలిసిపోతుంది కాబట్టి, నూనె బ్రాండ్లు ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచడానికి కూడా భయపడతాయి. మొత్తానికి ఇదొక మంచి పరిణామం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+