రూ. 25,000 కోట్ల ప్యాకేజీ ఎగుమతుల్లో గ్లోబల్ హబ్ గా భారత్ అవ్వగలదా?

భారత ఎగుమతిదారులకు పెద్ద సపోర్ట్! అమెరికా 50% టారిఫ్‌ ప్రభావాల మధ్య, ప్రభుత్వం కొత్త ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ (EPM) ద్వారా రూ.25,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల నుంచి పెద్ద ఎగుమతిదారుల వరకు సులభమైన ఫైనాన్షియల్ సపోర్ట్, మార్కెట్‌ యాక్సెస్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది 2025-26 బడ్జెట్‌లో ప్రకటించబడింది. ఈ ప్యాకేజ్ వచ్చే ఆరు సంవత్సరాల (2025-31)లో అమలు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా 50% టారిఫ్ ప్రభావం (ఆగస్ట్ 27 నుండి) మరియు ఇతర అంతర్జాతీయ ఆర్థిక సవాళ్ల నుంచి ఎగుమతిదారులను రక్షించడం దీని ముఖ్య లక్ష్యం. టెక్స్టైల్స్, కెమికల్స్, లెదర్, ఫుట్‌వేర్ రంగాలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

MSME Exports MSME sector Easy loans Job opportunities Export promotion Economic growth Commerce Ministry Future direction

ప్రధానంగా ఎగుమతిదారులకు సులభంగా క్రెడిట్ ఇవ్వడం, మార్కెట్‌ యాక్సెస్ పెంపొందించడం, MSMEsకి రుణాలు అందించడం. దీని ద్వారా భారత్ ఎగుమతులు మరింత సస్టెయినబుల్, మరియు ఇన్‌క్లూసివ్ అయ్యేలా పెరుగుతాయి.

రెండు ప్రధాన ఉప-స్కీమ్‌లను ప్రకటించారు

1. నిర్యాత్ ప్రోత్సాహన్ ప్యాకేజ్ (రూ.10,000 కోట్లు):
నిర్యాత్ ప్రోత్సాహన్ ప్యాకేజ్ పేరు మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది. మొత్తం రూ.10,000 కోట్లకు పైగా సపోర్ట్ ఇవ్వబోతోంది. ఇందులోనే రూ. 5,000 కోట్లు ప్రత్యేకంగా ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ సపోర్ట్ కోసం కేటాయించారు అంటే, ఎగుమతిదారులకు తక్కువ వడ్డీ రుణాలు అందేలా చూస్తున్నారు.

ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా ఎగుమతిదారుల (MSMEs) కోసం ప్రత్యేక సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా, రుణాలపై వచ్చే అధిక వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వం రూ. 5,000 కోట్ల ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ సపోర్ట్ ప్రకటించింది. దీని వల్ల MSMEs తక్కువ ఖర్చుతో రుణాలు పొందగలుగుతారు.

అలాగే ఎగుమతిదారుల కోసం కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్లు, ఆన్‌లైన్ ఎగుమతిదారుల కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డు ప్లాన్ కూడా ఉంది. ఇవి వ్యాపారులకు తక్షణ నిధులు అందించడంలో సహాయపడతాయి. మొత్తంగా, ఈ చర్యలు చిన్న నుంచి పెద్ద ఎగుమతిదారుల వరకు అందరికీ ఆర్థిక సపోర్ట్ అందించడమే లక్ష్యంగా ఉన్నాయి.
ఎగుమతిదారులు తక్కువ టెన్షన్‌తో, తక్కువ వడ్డీతో, సులభంగా డబ్బు దొరికేలా ఈ ప్యాకేజ్ మద్దతు ఇస్తుంది.

2. నిర్యత్ దిశ (రూ.14,500 కోట్లు):

నిర్యత్ దిశ కింద రూ. 14,500 కోట్లకుపైగా నిధులు కేటాయించి, కొత్త ఎగుమతి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదనంగా, ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేందుకు క్వాలిటీ కాంప్లయెన్స్‌ కోసం రూ.4,000 కోట్లు, అలాగే భారత ఉత్పత్తులను కొత్త దేశాల్లో ప్రోత్సహించేందుకు విదేశీ మార్కెట్ అభివృద్ధిపై మరో రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.

ఇది మాత్రమే కాకుండా, బ్రాండింగ్, వేర్‌హౌసింగ్, లోజిస్టిక్స్ మెరుగుపరచి ఉత్పత్తులకు పేరు తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. భారత కంపెనీలు గ్లోబల్ వాల్యూ చైన్‌లో భాగమవ్వడానికి ప్రత్యేక సహాయం అందిస్తారు. మొత్తం ఈ చర్యలు ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసే సహకార వ్యవస్థ ద్వారా అమలు కానున్నాయి.

ఈ మిషన్ ఒక్క మంత్రిత్వ శాఖతో మాత్రమే కాకుండా, చాలామందితో కలిసి ముందుకు వెళ్తుంది. వాణిజ్య శాఖ, MSME మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లాంటి ముఖ్య విభాగాలు ఇందులో భాగమవుతున్నాయి. అలాగే EXIM బ్యాంక్, ECGC, CGTMSE, NCGTC వంటి ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రయత్నానికి తోడ్పపడుతున్నాయి.

ఇకపోతే, ఎగుమతి ప్రోత్సాహ కౌన్సిల్‌లు, కామోడిటీ బోర్డులు, ఇండస్ట్రీ అసోసియేషన్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది. ఇది ప్రభుత్వ, బ్యాంకులు, పరిశ్రమలు, రాష్ట్రాలు అందరూ కలసి చేసే ఒక జాయింట్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు.

MSME రంగం వేగంగా అభివృద్ధి చెందితే కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. పెద్ద పరిశ్రమలకే కాకుండా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా పెరుగుతాయి. దాంతో నేరుగా ఆ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే రవాణా, ప్యాకేజింగ్, సప్లై చైన్ వంటి అనుబంధ రంగాల్లో కూడా పరోక్షంగా కొత్త పనులు వస్తాయి. ఈ విధంగా MSME రంగం బలపడితే గ్రామీణం నుండి పట్టణం వరకు అనేక స్థాయిల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, భారత ఎగుమతులు నిలకడగా ఉన్నాయి. 2025 జూలైలో ఎగుమతులు 7.29% పెరిగి $37.24 బిలియన్‌కు చేరాయి. భవిష్యత్తు దిశలో చూస్తే, ఈ మిషన్ విజయవంతమైతే భారత్‌కి పెద్ద ఎగుమతి శక్తిగా ఎదగడానికి దారి తెరుస్తుంది. రాబోయే 5-10 ఏళ్లలో దేశ ఎగుమతులను రెట్టింపు చేయగల సామర్థ్యం ఈ ప్రణాళికలో ఉంది. ఇది కేవలం ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌కి మరింత స్థానాన్ని కల్పిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+